సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరియర్ కాలం చాలా తక్కువ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే దశాబ్ద కాలం గడిచిపోయింది అంటే చాలు హీరోయిన్లను సీనియర్ హీరోయిన్లు అని ముద్ర వేయడం చేస్తూ ఉంటారు. దీంతో ఇక ఇతర హీరోల సినిమాలో క్యారెక్టర్ఆర్టిస్ట్ గా ఛాన్సులు దక్కించుకోవడం లేదంటే సీనియర్ హీరోల సినిమాల్లో మాత్రమే హీరోయిన్గా నటించడం లాంటివి చేస్తూ ఉంటారు  అంతకు ముందు స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన భామలు. అయితే ఇలా స్టార్ హీరోయిన్గా అవ్వడమే ఇండస్ట్రీలో ఒక పెద్ద సవాల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్ని డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని సినిమాలు మాత్రమే హీట్ అవుతున్నాయి. అయితే ఒక హీరోయిన్ రెండు మూడు ఫ్లాపులు వచ్చాయి అంటే చాలు ఆమెను ఐరన్ లెగ్ అని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు అందరూ.


 అలాంటిది చేసిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోతే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ కాదు అంతకుమించి అని సోషల్ మీడియాలో టోల్ చేయడం చూస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు హీరోయిన్ కావ్య థాపర్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఏక్ మినీ కథ అనే ఒక చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్గా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా నేరుగా ఓటీటిలో రిలీజ్ అయినప్పటికీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీలో కేవలం హోమ్లీ గానే కనిపించిన కావ్య.. ఇక ఆ తర్వాత ఒక పాటలో అందాల ఆరబోత చేసి అందరీ దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. ఇక తర్వాత అవకాశాలు కూడా వచ్చేసాయి.


 పెద్ద హీరోల సినిమాల్లో మంచి అవకాశాలను దక్కించుకుంది. కానీ అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఆమె ఏ సినిమా చేసిన అది డిజాస్టర్ గానే మిగిలిపోతుంది. దీంతో ఇలాంటి డిజాస్టర్లు ఆమె కెరియర్ పై నీల నీడలు కమ్మేసాయి. ఆరంభంలో రవితేజ సరసన ఈగల్ మూవీలో నటించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ డిజాస్టర్ అయింది. కానీ అటు కావ్య గ్లామర్ కు మాత్రం మంచి పేరు దక్కింది. ఇక ఊరి పేరు భైరవకోన అనే మరో సినిమాలోని నటించింది. ఈ సినిమాలోను గ్లామర్ వలకబోసింది. కానీ ఈ సినిమాతో కూడా హిట్ కొట్టలేకపోయింది. ఇక మొన్నటికీ మొన్న ఇండిపెండెన్స్ డే రోజు వచ్చిన డబుల్ ఇస్మార్ట్ లోను ఈమె హీరోయిన్. ఈ సినిమా సూపర్ హిట్ మూవీకి సీక్వల్. దీంతో తన కెరీర్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా కూడా చివరికి డిజాస్టర్ గా మిగిలింది. గోపీచంద్ సరసన విశ్వం మూవీలో నటించింది. ఇందులోనూ గ్లామర్ రోల్ చేసింది. లిమిట్స్ కూడా క్రాస్ చేసేసింది. కానీ ఈ సినిమా తో కూడా హెట్టు కొట్టలేకయింది. దీంతో ఆమె ఏ సినిమా చేసిన డిజాస్టర్ అంటూ ఆమెను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: