ఒక హీరోయిన్ ఏంటి..? ఆ హీరోయిన్ నాగార్జునకు సొంత ప్రాపర్టీ లెక్క కావడం ఏంటి..? దీనిపై కమెడియన్ కి వార్నింగ్ ఏంటి..? అని ఆశ్చర్యపోతున్నారా. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. టాలీవుడ్ కింగ్ నాగార్జున.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. ఒకటి సూపర్ సినిమా కాగా.. రెండోది శివమణి. సూపర్ కంటే శివమణి బాగా సక్సెస్ అయింది. శివమణి సినిమాలో నాగార్జున యాటిట్యూడ్ సూపర్ గా ఉంటుంది. ముఖ్యంగా నాగార్జున బాడీ లాంగ్వేజ్ అందరికీ విపరీతంగా నచ్చింది. పూరి స్టైల్ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆశిన్, రక్షిత గ్లామర్ ఇంకా ప్లస్ అయింది.


ఆ తర్వాత నాగార్జున.. పూరి జగన్నాథ్ మేకింగ్ స్పీడ్ నచ్చి సూపర్ సినిమా చేశాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌కి అనుష్క శెట్టి, సోనూ సుద్‌ పరిచయం అయ్యారు. అనుష్కకు అదే మొదటి సినిమా కాబట్టి.. షూటింగ్ టైంలో బాగా ఇబ్బంది పడిందట. అప్పటికే ఆమె నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్యకు యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. ఈ సినిమా టైంలో అనుష్క బాగా ఇబ్బంది పడడంతో పాటు.. ఈ సినిమా తర్వాత మళ్లీ ఇండస్ట్రీ వైపు రాకూడదు అన్నంతగా ఫిక్స్ అయిందట. అయితే సూపర్ సినిమాలో అనుష్క పాత్రకు వచ్చిన రెస్పాన్స్.. పాపులారిటీ తర్వాత ఆమె మళ్ళీ వెనక్కి వెళ్ళలేదు.


ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో మరో హీరోయిన్ ఆయేషా టాకీయా.. భారీ ఎత్తు అందాలతో అలరించిన ఆయేషా.. నవ్వుకి నాగార్జున ఫ్లాట్ అయిపోయాడు. ఆమె నవ్వినప్పుడు ముక్కు ఒకలా పెడుతుంది. అది అందరినీ ఆకట్టుకుంది. ఇదే విషయంలో పాపులర్ కమెడియన్ ఆలీ.. నాగార్జున ముందు ఫన్నీగా కామెంట్ చేశాడట. అందరి ముందు నవ్వి ఊరుకున్న నాగార్జున.. ఆ తర్వాత ఆలీకి వార్నింగ్ ఇచ్చాడట. అలీ కూడా సూపర్ సినిమాలో నటించాడు. ఆ చనువుతోనే ఆయేషా నవ్వు పై కాస్త కామెంట్ చేశాడట. వెంటనే నాగార్జున.. ఆయేషా నా ప్రాపర్టీ అన్నట్టుగా ఆలీకి వార్నింగ్‌ ఇచ్చాడట. ఎంతైనా ఆ సినిమాకు నాగార్జున నిర్మాత కథ.. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సూపర్ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: