మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా ... అంజలి , శ్రీకాంత్ , నవీన్ చంద్ర , సునీల్మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాని మొదట డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కానీ కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను డిసెంబర్ 20 వ తేదీన కాకుండా వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను చరణ్ ఇండియా వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఇక శంకర్ కి ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. దానితో గేమ్ చేంజర్ మూవీ కి గనుక కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది అని కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది అని చరణ్ అభిమానులతో పాటు కొంత మంది మామూలు సినీ ప్రేమికులు కూడా అంచనా వేస్తున్నారు.

ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా నుండి మేకర్స్ కొన్ని ప్రచార చిత్రాలను మరియు రెండు పాటలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన రెండు పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా నుండి మూడవ పాటను కూడా మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: