పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన ఈ సినిమా అభిమానులను ఎంతలా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజై.. బాక్సాఫీస్ వద్ద తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల క్లబ్‌లో చేరిన భీమ్లానాయక్ ఎనిమిది రోజుల్లో రూ. 170 కోట్ల వసూలు చేసింది.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారత్ లోనే కాదు యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో డాలర్ల వర్షం కురిపిస్తూ పవన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది.  

ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాసారు.  పవన్ కళ్యాణ్, రానాలకు హీరోయిన్స్‌గా నిత్య మీనన్, సంయుక్త మీనన్ లు నటించారు.  రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. ఇక పవన్ కల్యాణ్ పోలీసు దుస్తుల్లో కనిపించిన నాలుగో సినిమా ఇది. అంతకు ముందు 'పులి', 'గబ్బర్ సింగ్', 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు. పవన్ నటించిన  రెండో మల్టీస్టారర్ ఇది. గతంలో బాబాయ్ విక్టరీ వెంకటేశ్తో 'గోపాల గోపాల' చేయగా, భీమ్లా నాయక్

  సినిమాలో అబ్బాయ్ రానాతో కలిసి తెర పంచుకున్నారు. ఈ సినిమాలో పవన్, 'భీమ్లా నాయక్' అనే గిరిజన ఎస్సై పాత్ర చేయడం విశేషం. ఇటీవల కాలంలో ఓ అగ్రకథానాయకుడు.. ట్రైబల్ రోల్ చేయడం వల్ల సినిమా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇకపోతే బాహుబలి' సినిమాలో భళ్లాలదేవగా అలరించిన రానా.. ఇందులో పవన్తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దీంతో సినిమాలో వీరిద్దరి మధ్య సన్నివేశాల కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా కాంబినేషన్లో వచ్చిన బీమ్ల నాయక్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: