టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. అలా చిన్న పాత్రలతోనే ఈయన తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ఈయన ఏకంగా సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ నేరుగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది.

ఇందులో సుహాస్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. దానితో ఈ మూవీ తర్వాత నుండి ఈయనకు వరుస పెట్టి సినిమాలో హీరోగా అవకాశాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే గొప్ప నటన ఉన్నా కూడా ఈయనకు వరుసగా రెండు నెలల్లో రెండు అపజయాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కాయి. సెప్టెంబర్ నెలలో సుహాస్ "గొర్రె పురాణం" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా కంటే ముందు సుహాస్ నటించిన చాలా సినిమాలు మంచి విజయం సాధించి ఉండడం , గొర్రె పురాణం సినిమా ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని జనాలు అనుకున్నారు.

కానీ ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే సుహాస్ తాజాగా జనక అయితే ఘనత అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా భారీ కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. మరి ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే వరుసగా రెండు నెలల్లో రెండు అపజయాలు సుహాస్ కి దక్కినట్లు అవుతుంది. మరి జనక అయితే గనక ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: