మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. కియార అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఈ సినిమాలో అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ని బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా చాలా రోజుల క్రితమే పూర్తి అయ్యాయి. ఈ మూవీ లో కన్నడ సినిమా పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ , వృద్ధి సినిమా బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో చరణ్ కి జోడిగా జాన్వి కపూర్ కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినింకి సంగీతం అందించడున్నాడు. ఇకపోతే ఇప్పటికే రెహమాన్ ఈ సినిమాకు సంబంధించిన నాలుగు పాటలను అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొంత కాలం లోనే ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే రెహమాన్ ఈ సినిమాకు సంబంధించిన నాలుగు పాటలు అందించడంలో అందులోని ఒక ఓ సాంగ్ తో చరణ్ , జాన్వి లపై ఓ పాటను చిత్రీకరించాలని మూవీ యూనిట్ ఫిక్స్ అయినట్లు సాంగ్ తోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించడానికి మేకర్స్ డిసైడ్ అయినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు ఈ మూవీ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ కావడంతో ఈ సినిమాను ఆర్సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో స్టార్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: