‘దేవర’ ఫలితం తెలిపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి అంతా డిసెంబర్ 5న విడుదలకాబోతున్న ‘పుష్ప 2’ పై ఉంది. బన్నీ అభిమానులు అయితే ఈమూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. ఈసినిమాకు సంబంధించిన ఫస్ట్ హాఫ్ ఫైనల్ కాపీ లాక్ అవ్వడంతో ఆ ఫైనల్ కాపీని చూసిన కొందరు ఇండస్ట్రీ ప్రముఖులు ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు.
కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినిమా అభిమానులు మాత్రమే కాకుండా ఉత్తరాది ప్రాంతాలకు చెందిన వారు కూడ ఈమూవీ విడుదల కోసం చాల ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’ పార్ట్1 లో బన్నీ చూపెట్టిన డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉత్తరాది ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో అంతకు మించిన బాడీ మ్యానరిజమ్స్ ‘పుష్ప 2’ లో ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.
తెలుస్తున్న సమాచారంమేరకు ‘పుష్ప-2’ సినిమాకు హిందీలో బిజినెస్ ఊహించిన స్థాయికన్నా భారీ రేట్లకు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలాంటి పరిస్థితుల మధ్య దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈమూవీ విడుదలకు ఒకరోజు ముందు రాత్రి 9.30లకు ‘పుష్ప 2’ స్పెషల్ ప్రిమియర్ బాలీవుడ్ సెలబ్రెటీలు మీడియాకు ప్రత్యేకంగా వేస్తారని తెలుస్తోంది.
ఈ స్పెషల్ ప్రీమియర్ షోలకు బాలీవుడ్ కు సంబంధించిన ప్రముఖ హీరో హీరోయిన్స్ ను ఆహ్వానిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి ‘పుష్ప’ గతంలో బ్లాక్ బష్టర్ హిట్ అయినప్పటికీ ఈ సీక్వెల్ ను ఈమూవీ విడుదలకు ముందు బాలీవుడ్ ప్రముఖులకు చూపెట్టడం ఒకవిధంగా సాహసమే కాకుండా సుకుమార్ కు ఈ మూవీ ఘనవిజయం పై సుకుమార్ బన్నీ లకు ఉన్న మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని చూపెడుతోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాది ప్రేక్షకులలో ఒక్క ప్రభాస్ కు మాత్రమే మ్యానియా ఉంది దీనితో ప్రభాస్ తో పోటీ పడటానికి బన్నీ సిద్ధంగా ఉన్నాడు అనుకోవాలి..