లక్ష్మీ ప్రణతి చాలా చాలా సైలెంట్ పర్సన్ . పెళ్లి తర్వాత తన భర్త.. తన పిల్లలే ప్రపంచం అంటూ తన ఇష్టా ఇష్టాలను కూడా వదులుకొని మరి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. అలాంటి లక్ష్మీ ప్రణతికి ఫేవరెట్ హీరో ఎవరు అన్న ప్రశ్న ఎదురైతే ఆమె ఇచ్చిన ఆన్సర్ అందరికీ షాకింగ్ గా అనిపించింది . ఎవరైనా సరే తన భర్త పెద్ద హీరో అయినప్పుడు కచ్చితంగా ఆ హీరో పేరుని ఫేవరెట్ హీరోగా ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్.
కానీ లక్ష్మీ ప్రణతి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? సీనియర్ ఎన్టీ రామారావు గారు. లక్ష్మీ ప్రణతికి ఇప్పటికీ సీనియర్ ఎంటీ రామారావు గారి సినిమాలను చూస్తుందట . మరి ముఖ్యంగా ఆయన నటించిన సినిమాలలో దానవీరశూరకర్ణ , గుండమ్మ కథ సినిమాలు అంటే లక్ష్మీ ప్రణతికి చాలా చాలా ఇష్టమట. నేటి జెనరేషన్ కి సంబంధించిన అమ్మాయి అయినా ఆమె ఇష్ట ఇష్టాలు.. అలవాట్లు మాత్రం పాతకాలం పద్ధతిలో మాదిరిగానే ఉంటాయి . అందుకే లక్ష్మీ ప్రణతి అంటే ఎన్టీఆర్ అభిమానులకి అంత ఇష్టం . వదినమ్మ వదినమ్మ అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు..!!