సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమాకి అయినా పబ్లిసిటీ మొదలయ్యేది టైటిల్ నుంచే... సినిమా టైటిల్‌ను బట్టి ప్రేక్షకుల్లో ఆ సినిమా ఎలాంటిదో ఐడియా వచ్చేస్తుంది.. అయితే  ఓ సినిమాకి టైటిల్ పెట్టడం అనేది ఎంతో పెద్ద విషయం అని డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అంటారు. సినిమాకి పబ్లిసిటీ వస్తుంది కదా అని ఏదో ఒక టైటిల్ పెట్టినా చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి. ఇక ఉదాహరణకు గత సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమానే చెప్పుకోవచ్చు.. ఈ సినిమా టైటిల్ విషయంలో నిర్మాత నాగ‌ వంశీ చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే.  అయితే మా సినిమాకి మేము గుంటూరు కారం అనే టైటిల్ పెట్టమనేది చాలా తప్పు అనిపించింది. దాని వల్ల కథకి ప్రేక్షకులు సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయారు. మాది ఫ్యామిలీ సినిమా కానీ టైటిల్ను బట్టి అంత మాస్ సినిమా అనుకున్నారు.. అందువల్ల ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు కథకి సరిగ్గా కనెక్ట్ అవ్వలేకపోయారంటూ తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నాగ‌ వంశీ చెప్పకు వచ్చాడు.


దీన్ని బట్టి సినిమాకి టైటిల్ విషయంలో మేకర్స్  ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అంటారు.  అయితే గతంలో ఓ దర్శకుడు మాత్రం సినిమాకి టైటిల్ పెట్టకుండా ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చాడు. అలాగే సినిమాను చూసి ప్రేక్షకుల‌లే టైటిల్ పెట్టండి అంటూ ప్రేక్షకులకు ఆ బాధ్యత ఇచ్చాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు బివి రమణ.. తరుణ్ తో ఎలా చెప్పను, సుమంత్ గౌరీ, గోపీచంద్ ఒంటరి వంటి సినిమాలు తెర‌క‌క్కెంచాడు రమణ. అయితే వీటి కంటే ముందే జెడి చక్రవర్తి హీరోయిన్ మీనాను జంటగా పెట్టి ఓ సినిమాను తెర్కెక్కించాడు.


అలాగే సహజ‌నటి జయసుధ ఇందులో ముఖ్యపాత్ర పోషించింది.  అయితే ఈ సినిమా మొత్తం స్టార్ హోటల్లో జరుగుతుంది తల్లిని పోగొట్టుకున్న కూతుర్ని అన్నీ తానై ఉండాలనే ఓ తండ్రి.. అనుకోకుండా కొందరు దుండగులు అతని కూతుర్ని కిడ్నాప్ చేసి ఓ మర్డర్ కేసులు ఇరికించాలని ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందని సస్పెన్స్ తో కథ‌ ముందుకు వెళుతుంది. ఈ సినిమా టైటిల్ పెట్టకుండా విడుదల చేశారు. సరైన టైటిల్ చెబితే క్యాష్ ప్రైజ్‌ ఇస్తామని కూడా ప్రకటించారు. 1998 అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. కొంతమంది ప్రేక్షకులకి నచ్చింది.. ఇంకొంతమంది ప్రేక్షకులకి నచ్చలేదు. అయితే సినిమా చూశాక.. చాలా మంది ఈ సినిమాకి ‘పాపే నా ప్రాణం’ అనే టైటిల్ బాగా సూట్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ టైటిల్ నే తమ సినిమాకి పెట్టుకున్నారు మేకర్స్. ఇక నేటితో ‘పాపే నా ప్రాణం’ సినిమా రిలీజ్ అయ్యి నేటితో 26 ఏళ్లు పూర్తి కావస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: