ఈ మధ్యకాలంలో బాలయ్యకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా అఖండ - వీరసింహారెడ్డి - భగవంత్ కేసరి మూవీలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న బాలయ్యకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అదేవిధంగా బాలయ్య సైతం యంగ్ హీరోలకు ధీటుగా ఉండే కథలను చూస్  చేసుకుంటూ జనాలను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నారు .
 

ప్రెసెంట్ బాబీ దర్శకత్వంలో ఆయన తన కెరియర్ 109వ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే అఖండ 2 ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు.  ఎప్పుడెప్పుడు బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో సినిమా వస్తుందా..?  అంటూ వేచి చూసిన జనాలకు రీసెంట్ గానే గుడ్ న్యూస్ అందజేశారు బాలయ్య - బోయపాటి . అఖండ 2 రాబోతుంది అంటూ ప్రకటించారు . తాజాగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు . ఆ పూజా కార్యక్రమాలలో అందరికన్నా స్పెషల్ గా నిలిచారు బాలయ్య .



చాలా ఎనర్జిటిక్ ..హ్యాండ్సమ్ లుక్ లో అందరినీ ఆకట్టుకున్నాడు . మరీ ముఖ్యంగా ఆయన వేసుకున్న షర్ట్ ఆకర్షణీయంగా అనిపించింది . అయితే సోషల్ మీడియాలో ఈ షర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా అయ్యాయి . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం బాలయ్యకు ఈ షర్ట్ తన భార్య వసుంధర దేవి గిఫ్ట్ చేసిందట . అది కూడా బాలయ్య పుట్టినరోజు సందర్భంగా . అందుకే మోస్ట్ స్పెషల్ పర్సన్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ని బాలయ్య.. తన లైఫ్ లోనే ఎంత స్పెషల్ అయిన అఖండ 2 పూజా కార్యక్రమాలలో వేసుకున్నారట.  దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు  బాగా ట్రెండ్ అవుతుంది. బాలయ్య అభిమానులు కూడా ఈ షర్ట్ లో బాలయ్య అద్దిరిపోయేలా ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అఖండ 2 తో మరో బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు బాలయ్య అనడంలో ఏమాత్రం సందేహం లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: