మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ కి ఇప్పుడు కోటి కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరు మేకర్స్ . అంతేకాకుండా ఆ దేవుడు కరుణించి ఏదో రెండు ఆఫర్లను ఖాతాలో పడేలా చేశాడు.. అనుకునే లోపే ఆ ఆఫర్లు కాస్త వేరే హీరోయిన్ ఒడిలోకి చేరిపోయాయి . దీంతో ఈ హీరోయిన్ జాతకం బాగోలేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఆమె మరి ఎవరో కాదు.." పూజ హెగ్డే".
బుట్ట బొమ్మగా తెలుగు ఇండస్ట్రీలో బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అల్లు అర్జున్ - మహేష్ బాబు - రామ్ చరణ్ - ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో కూడా జతకట్టింది. అయినా ఏం లాభం ప్రజెంట్ ఇప్పుడు ఒక్క స్టార్ హీరో కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు . అంతేకాదు రీసెంట్ గానే తెలుగులో ఒకటి బాలీవుడ్ లో ఒకటి సినిమాలకు కమిట్ అయినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ రెండు కూడా ఇప్పుడు వేరే హీరోయిన్ ఖాతాలోకి పడిపోయాయట . దీంతో ఈ హీరోయిన్ టైం అస్సలు బాగాలేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!