నటరత్న ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరో గా టాలీవుడ్ కి దిక్కు చూసిగా మారారు. ఆయన తర్వాత అక్కినేని నాగేశ్వరరావు కూడా టాలీవుడ్ కు మరో పెద్దగా ఎదిగారు. వీరిద్దరూ తెలుగు చిత్ర పరిశ్రమ కు రెండు కళ్ళు లాంటి వారి ని కూడా అంటారు . అలాగే ఎంతో మంది దర్శక , నిర్మాతలు ఇండస్ట్రీలోకి రావటానికి గొప్ప గొప్ప సినిమాలు చేయడాని కి వీరు ఎంతో కృషి చేశారు. అప్పట్లో ఇద్ద‌రు టాప్ హీరోలు అయినప్పటి కీ ఏమాత్రం  గొడవల కి పోకుండా అన్నదమ్ములుగా ఉండేవారు. ఈ ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కలిసి నటించడానికి ఏమాత్రం ఆలోచించేవారు కాదు.


వీరిద్దరూ కలిసి 14 సినిమాల్లో  నటించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఇలాంటి వీరీ బంధానికి ఒకసారి బ్రేక్ పడింది.. అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు భార్య అన్నపూర్ణ గారు .. ఎన్టీఆర్ తో కలిసి నటించొద్దని అక్కినేని దగ్గర ఆమె మాట తీసుకుంది . ఆమెకి ఇచ్చిన మాట కోసం 14 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి నటించలేదు. 1963 లో వచ్చిన శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమా తో వీరి కాంబినేషన్ కి బ్రేక్ పడింది.


కృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ అర్జునుడు పాత్రలో నాగేశ్వరరావు నటించారు. 1963 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. కృష్ణుడు పాత్రకి ప్రాధాన్యత ఉండటం వలన ఎన్టీఆర్ పాత్ర అద్భుతంగా పండింది అక్కినేని పాత్ర తేలిపోయింది. అభిమానులు ఎంతో బాధపడ్డారు ఈ విషయం అన్నపూర్ణకు అభిమానులు చేరవేశారు. ఆమె వెంటనే ఎన్టీఆర్ తో సినిమాలు చేయకూడదని మాట ఇవ్వమని అడిగారు. 14 ఏళ్ల పాటు  వీళ్ళ కాంబినేషన్లో సినిమాలు రాలేదు . 1977లో చాణక్యచంద్రగుప్త మూవీ లో కలిసి నటించారు .. ఎన్టీఆర్ స్వయంగా నటించమని కోరారు ఇలా మళ్లీ వీరిద్దరూ సినిమా చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: