అక్కినేని మాజీ కోడలు హీరోయిన్ సమంత  అంటే తెలియని వారు ఉండరు.ఈమె కేవలం సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా పాగా వేసేందుకు ఈ మధ్యకాలంలో హిందీ సినిమాల్లో బాగానే నటిస్తోంది.ముఖ్యంగా వెబ్ సిరీస్ ల ద్వారా ఈమె ఫేమస్ అయిపోతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే సిటాడాల్ హనీ బన్నీ అని వెబ్ సిరీస్ తో మన ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ వెబ్ సిరీస్ ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సమంతా రుత్ ప్రభు లు హీరో హీరోయిన్ గా చేస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ హాలీవుడ్ సిటాడెల్ వెబ్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ లో రాబోతుంది.ఇక హాలీవుడ్ లో వచ్చిన సిటాడిల్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా చాలా బోల్డ్ గా నటించింది.

ఇక ఆ వెబ్ సిరీస్ కి ఇండియన్ వెర్షన్ కాబట్టి ఇందులో కూడా సమంత వరుణ్ దావన్ ల మధ్య లిప్ లాక్,రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉంటాయని తెలుస్తుంది.కానీ ట్రైలర్ లో ఎక్కువగా ఈ సన్నివేశాలు చూపించలేదు. అయితే విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి ప్రమోషన్స్ లో బిజీ బిజీ అయిపోయారు చిత్ర యూనిట్. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ సమంత పై తన ఇష్టాన్ని బయటపెట్టేశారు. వరుణ్ ధావన్ మాట్లాడుతూ..  నేను సమంతను రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా లో చూసినప్పుడే ఇష్టపడ్డాను.ఆ సమయంలోనే ఆమెకు ఫిదా అయిపోయాను. ఈగ సినిమా చూసినప్పటి నుండి సమంత పై నాకు ఇష్టం పెరిగిపోయింది.

 ముఖ్యంగా ఆమెకు నేను వీరాభిమానిని. అలాంటి నా అభిమాన హీరోయిన్ తో ఈ వెబ్ సిరీస్ లో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకరకంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను అంటూ వరుణ్ ధావన్ సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు  అయితే వరుణ్ ధావన్ సమంతపై ఆసక్తికర కామెంట్లు చేయడంతో ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ పెళ్లయిన నువ్వు మరో అమ్మాయి పై ఇలా ఇష్టం పెంచుకుంటే నీ వైఫ్ తో గొడవలు వస్తాయి జాగ్రత్త..ఇక విడాకులే అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: