సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రానికి SSMB -29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి విషయం వినిపించినా సరే వైరల్ గా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమా కోసం అభిమానులు కూడా ఎలా ఉండబోతుందో ఈ సినిమా అంటూ ఎగ్జైటింగ్ గా ఎదురు చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే అభిమానులు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.


SSMB -29 సినిమా గ్లోబుల్ ట్రాకింగ్ యాక్షన్ మూవీ గా ఉండబోతుందనే విధంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర వర్మ తెలియజేశారు. ముఖ్యంగా ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాడ్ డ్రాప్ లో ఉండబోతుందట. ఇండియన్ జోన్స్ తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్పెషల్ లుక్ లో మహేష్ బాబు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే ఈ తాజాగా అభిమానులు ఒక స్పెషల్ పోస్టర్ ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఈ పోస్టర్ కి వేట మొదలయ్యింది ఆట మొదలైందనే విధంగా అభిమానులు షేర్ చేస్తూ ఉన్నారు.



పోస్టర్  విషయానికి వస్తే మహేష్ బాబు గుర్రం మీద స్వారీ చేస్తూ ప్రపంచాన్ని చుట్టేయడానికి బయలుదేరినట్లుగా చూపించారు.. అలాగే గుబురు గడ్డం, లాంగ్ హెయిర్ , వెనుక బ్యాగుతో స్టైలిష్ గా కనిపించారు. అయితే దీనిని ఏఐ తో డిజైన్ చేసినట్లుగా సమాచారం. అయితే ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ల కనిపించడం లేదని ఫస్ట్ లుక్ పోస్టర్లా ఉందంటూ పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలు కూడా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించి సినిమా షూటింగ్ను కూడా అప్పుడే మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యాన్ మోడ్ పోస్టర్ వైరల్ అవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: