* సౌందర్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అంతఃపురం
* భానుమతిగా సౌందర్య నటన అద్భుతం
* కృష్ణవంశీ దర్శకత్వ ప్రతిభకు అద్దంలా నిలిచిన అంతఃపురం
అలనాటి టాప్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తెలుగులో మహానటి సావిత్రి తరువాత ఆ రేంజ్ పాపులరిటీ సంపాదించిన హీరోయిన్ గా సౌందర్య మంచి గుర్తింపు సంపాదించింది.. కన్నడ భామ అయిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మయిలా తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంది.. సౌందర్య తెలుగులో ఎన్నో విభిన్న పాత్రలలో నటించి మెప్పించింది.. ప్రస్తుతం హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అవుతున్నారు.. దర్శకనిర్మాతలు కేవలం హీరోయిన్ పాత్ర ఉండాలి కాబట్టి కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ నేడు పెద్ద పెద్ద సినిమాలలోకి తీసుకుంటున్నారు. కానీ గతంలో హీరోయిన్స్ కోసమే దర్శకులు కొన్ని పాత్రలు సృష్టించేవారు.. ఆ పాత్రలలో హీరోయిన్స్ అద్భుతంగా నటించి ఎన్నో అవార్డ్స్ సైతం అందుకునేవారు.. అలా అవార్డ్స్ అందుకున్న హీరోయిన్స్ లో సౌందర్య టాప్ లో వున్నారు.. సౌందర్య తాను నటించే ప్రతి పాత్రను తాను తప్ప అంతలా ఎవరూ నటించలేని విధంగా ఆ పాత్రను రక్తి కట్టిస్తారు.. అలా నటించిన సినిమాలలో కృష్ణవంశీ తెరకెక్కించిన అంతఃపురం ఒకటి.. మాములుగా కృష్ణ వంశీ సినిమా అంటేనే కుటుంబ బాంధవ్యాలు మరియు అనుబంధాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.