హర్రర్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన చిత్రం మసూద.. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా చాలామందిని భయపెట్టింది. ఇప్పటివరకు ఎన్నో హర్రర్ చిత్రాలు వచ్చిన మసూద్ వంటి సినిమా మాత్రం రాలేదు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సాయి కారం దర్శకత్వం వహించారు. ఇందులో అలనాటి హీరోయిన్ సంగీత నటించింది. అలాగే కావ్య కళ్యాణ్రామ్, తిరువీర్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ తదితర నటీనటులు నటించారు.


అయితే ఈ సినిమాలో ముసుగులో వచ్చిన మసూద అందరిని భయపెడుతూ ఉంటుంది. ఇందులోని ప్రతి సన్నివేశాలు కూడా వణుకు పుట్టించేలా ఉంటాయి.. చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. మసూద చిత్రంలో దెయ్యంగా నటించిన హీరోయిన్ ముఖాన్ని మాత్రం చూపించకుండా కవర్ చేస్తూ ఉంటారు. కేవలం బుర్కాలో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇందులో దయ్యం ఎవరనే విషయంపై చాలామంది తెగ వెతికేశారు. అయితే తాజాగా మసూద సినిమాలో నటించిన ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక ఫోటో సీన్లో చూపించారు.



మసూద చిత్రంలో దెయ్యం గా నటించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు ఈమె పేరు అఖిల రామ్.. ఈమె పలు చిత్రాలలో కూడా నటి. లిఫ్ట్ 8055 అనే చిత్రంలో కూడా నటించిందట సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలు అయితే షేర్ చేస్తూ ఉంటుంది అఖిలా.. తాజాగా ఈమె ఫోటోలు వైరల్ కావడంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఇంతటి బ్యూటీని ముసుగు వేసి మసూద సినిమాలో చూపించారా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంతటి అందమైన అమ్మాయిని దెయ్యాన్ని చేశారు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈమెకు సంబంధించి ఒక ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది మరి మసూద-2 లో ఇమే పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: