అలాగే ఈమె రెండో సినిమాలో హీరోగా నటించిన ప్రసన్ననే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈమె తెలుగులో తొలివలపు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమెకు టాలీవుడ్ లో మంచి పేరు తీసుకువచ్చిన సినిమాలలో శ్రీరామదాసు, మధుమాసం, సంక్రాంతి, వెంకీ సినిమాలలో తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది స్నేహ. తెలుగులో స్నేహ హీరోయిన్గా 15 పైగా సినిమాల్లో నటించింది. పెళ్లి తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్లో వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా కొనసాగుతుంది.
అయితే స్నేహ కెరీర్ లో హీరోయిన్గా ఆమెకు గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమాలలో ముందుగా శ్రీరామదాసు మూవీ గురించి చెప్పుకోవాలి..అన్నమయ్య తర్వాత కే రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో భక్తి రస చిత్రంగా తెరకెక్కిన శ్రీరామదాసులో స్నేహ హీరోయిన్ గా నటించింది. ఆమె తన నటనతో ప్రేక్షకులను మైమర్పింప చేసింది. అలాగే సావిత్రి, అంజలీదేవి వంటి నటులను కూడా తన నటనతో గుర్తుచేసింది. అలాగే ఆమె కెరియర్ లో చెప్పుకోదబ్బ మరో మాస్ సినిమా వెంకీ.. ఈ సినిమాను దర్శకుడు శీను వైట్ల రవితేజ హీరోగా తెర్కెక్కించాడు. పక్క కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ సినిమాలో స్నేహ క్యారెక్టర్ చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఈ సినిమాల కూడా ఈమె తన నటనతో మైమరిపింప చేసింది. అలా ఈ రెండు సినిమాలు ఈమె కెరియర్ మొదట్లో ఈమెకు గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమాలుగా నిలిచాయి.