సినిమా విజయం సాధించడంలో సంగీతం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మన చిత్ర పరిశ్రమలలో సంగీత దర్శకుడు అనే వాడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక దానికి తగ్గట్టే మన మ్యూజిక్ డైరెక్టర్స్ సదరు సినిమాలకు అదిరిపోయే సంగీతాన్ని అందిస్తూ, ప్రేక్షకులను రంజింపజేస్తారు. టాలీవుడ్లో అరడజను మంది సంగీత దర్శకులు ఉన్నప్పటికీ ఇద్దరు మాత్రమే బిజీగా ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే ఒకే ఒక్క దర్శకుడు దాదాపుగా అన్ని సినిమాలనూ చుట్టేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ దర్శకుడు కూడా మెల్లగా కనుమరుగవ్వడం మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇపుడు దర్శక నిర్మాతలు అంతా కలిసి సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చుట్టూ తిరుగుతున్నారు.

ఈ క్రమంలోనే అనిరుధ్ తెలుగు, తమిళ్, హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. అనిరుధ్ మూవీస్ మేగ్జిమమ్ స్టార్ హీరోలతోనే ఉండటం వలన అతగాడు పాడిందే పాటగా కనబడుతోంది. అవును, ఇక సొంత ఇలాకా అయినటువంటి కోలీవుడ్లో అయితే టైర్ 1 హీరోలు అందరికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడు. ఇక తెలుగులో కూడా అనిరుధ్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నాడు. రీసెంట్ గా ‘దేవర’ మూవీతో సక్సెస్ ని అందుకున్న అనిరుధ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా 2 సినిమాలకి వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దాదాపుగా పాన్ ఇండియా హీరోల సినిమాలకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేయడంతో అతను రెమ్యునరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నాడు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కోసం అతడు 12 కోట్ల వరకు వసూళ్లు చేస్తున్నాడంట మరి. అదే మినిమమ్ బడ్జెట్ మూవీస్ కోసం అయితే, 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడని టాక్ వినబడుతోంది. ఇలా రెమ్యునరేషన్ విషయంలో అనిరుద్ రెహమాన్ ని దాటేశాడు అనడంలో అతిశయోక్తి కాదు. ఇక రెహమాన్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తోన్న ‘RC 16’ కోసం 10 కోట్లు తీసుకుంటున్నాడు అని టాక్. మరి ఆ లెక్కన అనిరుధ్ రెమ్యునరేషనే ఇక్కడ ఎక్కువ అని స్పష్టమౌతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: