టాలీవుడ్ లో బడా హీరోలు అందరూ ఇప్పుడు బిజీ బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక సినిమా కాదు రెండు మూడు.. సినిమాలను లైన్లో పెట్టి షూటింగ్ లతో బిజీ బిజీగా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతానికి ఏ సినిమా చేస్తున్నారు ? వారి తర్వాత జాబితాలో ఏయే సినిమాలు ఉన్నాయి. అనే విషయాలు తెలుసుకుందాం.


1) చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వాస్తవానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా కోసం డిసెంబర్ సినిమాను సమ్మర్ కు వాయిదా వేశారు. ఈ సినిమా తర్వాత చిరంజీవి హరీష్ శంకర్ తో పాటు మరో ఇద్దరు యువ దర్శకులతో సినిమాలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
2) నందమూరి బాలకృష్ణ :
బాల‌య్య‌ విషయానికి వస్తే ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన కెరీర్లో 109వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లనుంది.
3) పవన్ కళ్యాణ్ :
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు - సుజిత్ దర్శకత్వంలో ఓజి - హరీశంకర్ దర్శకత్వంలో ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాలు చేయాల్సి ఉంది.


4) ప్రభాస్ :
ప్రభాస్ విషయానికొస్తే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ - హ‌ను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా.. అలాగే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ - ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో స‌లార్ 2 సినిమాలు చేస్తున్నారు. వీటిలో రాజాసాబ్ మాత్రమే సెట్స్ మీద‌ ఉంది.
5) మహేష్ బాబు :
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతోంది.
6) రామ్ చరణ్ :
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి చేశాడు. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తన 16 సినిమాలో నటించనున్నాడు.


7) అల్లు అర్జున్ :
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా డిసెంబర్ 6న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా పూర్తయ్యకి అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.
8) జూనియర్ ఎన్టీఆర్ :
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతానికి వార్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత దేవర 2 - ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: