పుష్ప ది రూల్ మూవీ ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్ తో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కాగా ఈ సినిమాకు బిజినెస్ సైతం రికార్డ్ స్థాయిలో చేస్తున్నారు. పుష్ప1 మూవీకి వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో ఉంచుకుని పుష్ప2 సినిమా హక్కులను బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్ సినిమాలను మించి బిజినెస్ చేస్తున్నారు. పుష్ప2 సీడెడ్ హక్కులు ఏకంగా 30 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.
 
అభిషేక్ రెడ్డి ఈ హక్కులను కొనుగోలు చేశారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. ఈ స్థాయిలో కలెక్షన్లను సాధించడం అంటే పుష్ప ది రూల్ మేకర్స్ కు తలకు మించిన భారం అని చెప్పవచ్చు. దేవర సినిమాకు సీడెడ్ లో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రావడంతో పాటు 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. అయితే సీడెడ్ లో యంగ్ టైగర్ కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
 
ఈ మ్యాజిక్ అన్ని సినిమాలకు వర్కౌట్ కాదనే సంగతి తెలిసిందే. పుష్ప2 మూవీ ఉత్తరాంధ్ర హక్కులు సైతం 23 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సాయి కొర్రపాటి ఈ హక్కులను కొనుగోలు చేశారని తెలుస్తోంది. నైజాంలో మైత్రీ నిర్మాతలు సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారని భోగట్టా. తెలుగు రాష్ట్రాల్లో పుష్ప2 మూవీ బిజినెస్ లెక్కలు ఏకంగా 190 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.
 
బన్నీ సుకుమార్ మార్కెట్ ను నమ్ముకుని మేకర్స్ చేస్తున్న రిస్క్ కు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కగా ఈ సినిమా నాలుగో సినిమా అనే సంగతి తెలిసిందే. పుష్ప2 సినిమా విషయంలో మేకర్స్ ఒక విధంగా సాహసం చేశారనే చెప్పాలి. పుష్ప ది రూల్ మూవీ 2024 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: