సినిమాలకి నేడు గడ్డుకాలం నడుస్తోంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకప్పటిలా సినిమాలు 100 రోజులు, 200 రోజులు అని ఆడే రోజులు కనుమరుగయ్యాయి. సినిమా ఒక్క వారం కూడా ఆడే పరిస్థితి ఇప్పుడు లేదు. శుక్రవారం రిలీజ్ అయి, సోమవారంతో కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. సినిమా ఎంతో బాగుంటే తప్ప ఆడిన పరిస్థితులు కనబడడం లేదు. దాంతోనే థియేటర్స్ నడుపుతున్న ఓనర్స్ తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ కి కూడా అదే పరిస్థితి దాపురించింది.

ఇక తాజాగా వస్తున్న సమాచారం మేరకు, బడా మల్టీప్లెక్స్ అయినటువంటి పీవీఆర్ ఐనాక్స్ పీకల్లోతు కష్టాల్లో మునిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే గత కొంతకాలంగా పివిఆర్ నిర్వహకులు ఇదే విషయంపైన మాట్లాడుతూ వస్తుండడం మనం గమనించవచ్చు. ఇకపోతే తాజాగా పివిఆర్ ఐనాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అయినటువంటి 2024-2025 సంవత్సరానికి గాను, లాభాలకు బదులుగా నష్టాలను చవిచూసినట్టు ప్రకటించింది. సినిమా థియేటర్ల వ్యాపారం చేయించడం వలన ఈ పరిస్థితి వచ్చినట్టు సమాచారం.

ఇక గత సంవత్సరం రెండవ త్రైమాసికంలో అనగా, ఇదే సీజన్లో పివిఆర్ ఐనాక్స్ లాభాల బాట పడినట్టు నిర్వాహకులు చెప్పుకొచ్చారు. ఇదే విషయం పైన పలువురు సినిమా విశ్లేషకులు మాట్లాడుతూ... ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్న తరుణంలో, సగటు సినిమా ప్రేక్షకుడు థియేటర్ల వైపు రావడానికి మొగ్గు చూపడం లేదని తేల్చి చెబుతున్నారు. మరోవైపు పెద్దపెద్ద సినిమాలు వస్తున్నప్పుడు టికెట్ రేట్ కూడా జనాలకు సమస్యగా మారిందని విశ్లేషిస్తున్నారు. ఇటువంటి తరుణంలో సో కాల్డ్ సినిమా నిర్మాతలు సినిమా వ్యయాన్ని తగ్గిస్తూ, థియేటర్స్ ఓనర్స్ కి కాస్త తక్కువ మొత్తంలో సినిమాలను విక్రయించినట్లయితే థియేటర్ ఓనర్స్ లాభాలను చవిచూస్తారని చెప్పుకొస్తున్నారు. అయితే ఇది జరిగే పని కాదు గాని, వందల కోట్లు తీసుకుంటున్న సినిమా హీరోలు తమ తమ రమ్యునరేషన్ విషయంలో తగ్గితే అందరికీ లాభదాయకంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయం పైన మీ కామెంట్ ఏమిటో కింద తెలియజేయండి!

మరింత సమాచారం తెలుసుకోండి: