టాలీవుడ్ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వివాదం ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ పై ఏకంగా అసిస్టెంట్ గా పని చేసిన ఒక అమ్మాయి.. అత్యాచార ఆరోపణలు చేయడం.. ఒక ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టించింది. జానీ మాస్టర్ తనపై కొన్నేళ్లుగా  అత్యాచారం చేస్తున్నాడని.. ఇక మానసికంగా కూడా తీవ్ర వేధింపులకు గురి చేశాడు అంటూ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.


 అయితే జానీ మాస్టర్ బాగా పేరు మోసిన కొరియోగ్రాఫర్ కావడంతో ఈ విషయం కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే సంచలనంగా మారిపోయింది. అయితే ఈ కేసులో ఇరుక్కున్న జానీ మాస్టర్ కి చివరికి అటు నేషనల్ అవార్డు కూడా రద్దయింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు కూడా స్పందించారు. జానీ మాస్టర్ వివాదం నేపథ్యంలో ఆయన గురించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి. అయితే ఇలా జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు వచ్చిన వేళ ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ప్రస్తుతం మాస్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఒక లేడీ కొరియోగ్రాఫర్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారిపోయాయి.


 జానీ మాస్టర్ చాలా మంచివాడు అంటూ ఆ లేడీ కొరియోగ్రాఫర్ చెప్పింది. ఆమె ఎవరో కాదు అందరికీ తెలిసిన ఆని మాస్టర్. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు విషయం తెలిసి షాక్ లో మునిగిపోయాను అంటూ ఆని మాస్టర్ చెప్పుకొచ్చింది. వారం పాటు ఏమీ తోచని స్థితిలో ఉండిపోయాను అంటూ తెలిపింది. నేరం రుజువు కాకముందే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును కూడా రద్దు చేయడం నిజంగా బాధాకరం అంటూ అని వ్యాఖ్యానించింది. అసిస్టెంట్ గా పనిచేశాను. ఆయన ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అయన చాలా మంచి వ్యక్తి. ఎంతోమంది డాన్సర్లకి సహాయం కూడా చేశారు. కానీ ఇప్పుడు అమ్మాయి ఇష్యూ కాబట్టి ఈ విషయంపై ఎవరు స్పందించడం లేదు అంటూ ఆని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: