విచిత్రం అంటే ఇదే . ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్లల్లో సగం మంది హీరోలు మెగా కుటుంబంలోనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి అండ చూసుకొని మెగా ట్యాగ్ తగిలించుకొని ఇండస్ట్రీ లోకి వచ్చిన హీరోస్ ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అయితే ఇంట్లో బోలెడు మంది స్టార్స్ ఉన్నారు. హీరోస్ ఉన్నారు . అయినప్పటికీ చిరంజీవి భార్య సురేఖకి ఎవరు స్టార్ హీరో అనే విషయం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు .


చిరంజీవి భార్య సురేఖకు సోషల్ మీడియాలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇంకా పక్కాగా చెప్పాలంటే చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా కూడా సురేఖను ఇష్టపడుతూనే ఉంటారు . అంతటి ఓ మంచి మనిషి . అసలు ఆమెలో నెగిటివ్ పాయింట్ ఇది అని చెప్పడానికి స్కోప్ నే ఉండదు. అంతటి మంచి మనిషి . చిరంజీవి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే కారణం దానికి సురేఖ నే అని అంటూ స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.



కాగా అటువంటి సురేఖకు ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ..? "శోభన్ బాబు". ఎస్ మల్టీ టాలెంటెడ్ హీరో శోభన్ బాబు అంటే సురేఖకు చాలా చాలా ఇష్టం . భర్త పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ కొడుకు పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఇంట్లో బోలెడు మంది స్టార్స్ ఉన్నప్పటికీ సురేఖకు శోభన్ బాబు అంటేనే దీ మోస్ట్ ఫేవరెట్ హీరో అట.  అంతేకాదు ఇప్పటికి సురేఖ ..శోభన్ బాబు గారి సినిమాలను ఎక్కువగా చూస్తూ ఉంటారట.  ఈ జనరేషన్ కి తగ్గ సినిమాలు చూసిన సరే ఆమెకు మనసు బాగో లేకపోయినా ..ఎంటర్టైన్ అవ్వాలి అన్న ఏ మాత్రం ఖాళీ సమయం దొరికిన ఆమె ముందుగా శోభన్ బాబు గారి హిట్ సినిమాలను పెట్టుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తుందట . అప్పుడప్పుడు సరదాగా చిరంజీవి కూడా ఆటపట్టిస్తాడట . మా సినిమాలు కూడా చూడొచ్చు కదోయ్".. అంటూ సరదాగా మాట్లాడుతూ ఉంటారట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: