టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలు ఎవరు అనే ప్రశ్నకు ప్రభాస్, తారక్ పేర్లు సమాధానంగా వినిపిస్తాయి. ఈ ఇద్దరు హీరోల సినిమాలకు ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్లు వస్తుండగా యావరేజ్ టాక్ తో సైతం ఈ హీరోలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తారేమో చూడాల్సి ఉంది. ప్రభాస్, తారక్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ హీరోలను సరిగ్గా వాడుకుంటే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.
 
ప్రభాస్, తారక్ లను చాలామంది దర్శకులు సరిగ్గా వాడుకోవడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ హీరోలతో సరైన సినిమాను తెరకెక్కిస్తే మాత్రం 2000 కోట్ల రూపాయల కలెక్షన్లు సులువుగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ ఇద్దరు హీరోలకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ మాత్రం అంతాఇంతా కాదు.
 
సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఈ టాలీవుడ్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేస్తారని ఎలాంటి సందేహం అయితే అక్కర్లేదు. ప్రభాస్, తారక్ లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు దర్శకుల హీరోలు అని అనిపించుకుంటున్నారు. ప్రభాస్, తారక్ కాంబోలో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదనే సంగతి తెలిసిందే.
 
అయితే ప్రభాస్ తారక్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ప్రభాస్, తారక్ క్రేజ్ పరంగా టాప్ లో ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ హీరోల సినిమాలు అదరగొడుతున్నాయి. ఈ ఇండస్ట్రీఇండస్ట్రీ అనే తేడాల్లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ హీరోలు సత్తా చాటుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఎదుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. ప్రభాస్, తారక్ హీరోలుగా కెరీర్ పరంగా ఎన్నో మెట్లు ఎదుగుతూ ప్రశంసలు అందుకుంటున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: