త్రిష ప్రభాస్ వీరిద్దరిది ఒక ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు..ఎందుకంటే వీరిద్దరి కాంబోలో వచ్చిన మూడు సినిమాల సమయంలో వీరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం పెరిగిపోయింది.అంతేకాదు ఇండస్ట్రీ మొత్తం వీరి పెళ్లి వార్తలే నిండిపోయాయి.కానీ చివరికి ఇప్పటివరకు ఈ ఇద్దరు పెళ్లి చేసుకోలేదు. ఈ ఇద్దరూ వైవాహిక జీవితానికి దూరంగానే ఉన్నారు.. అయితే అలాంటి ఈ జంట గురించి అప్పట్లో ఎన్నో రూమర్లు వినిపించాయి. ఇక ఎప్పుడైతే ప్రభాస్ త్రిషతో నటించడం మానేశారు. అప్పటినుండి వీరి మధ్య రూమర్ వార్తలు ఆగిపోయాయి. అయితే అప్పట్లో త్రిష ప్రభాస్ లు పెళ్లి వరకు వెళ్లారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఇవన్నీ రూమర్ లో నిజాలో తెలియదు కానీ అవి జరగలేదు. అయితే గతంలో త్రిషని ప్రేమించిన ప్రభాస్ ఓ హీరోని బావ బావ అని ప్రేమగా పిలుచుకునే వారట.

ఇక అసలు విషయం ఏంటయ్యా అంటే.. ప్రభాస్ త్రిష కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో త్రిష చెల్లెలుగా సంజనా గల్రాని,త్రిష అన్నయ్యగా సీనియర్ నటుడు మోహన్ బాబు నటించారు.. అయితే సినిమా షూటింగ్లో భాగంగా త్రిషకి మోహన్ బాబు అన్నయ్య అవుతారు కాబట్టి మోహన్ బాబు వరుసకి ప్రభాస్ కి బావ అవుతారు. అలా ఎప్పుడైతే ఈ షూటింగ్లో పాల్గొన్నారో అప్పటి నుండి ఇప్పటివరకు మోహన్ బాబుని ప్రభాస్ బావ అని పిలవడం మానడం లేదట.
 

ఇక బుజ్జిగాడు సినిమా షూటింగ్లో ఒక్కరోజు మోహన్ బాబు రాకపోతే అంతా సైలెంట్ గా ఉండేదట.ఏంటి ఇవాళ బావ రాలేదా అంతా సైలెంట్ గా ఉన్నారు. ఎవరిలో ఎలాంటి హుషారు లేదు అని ప్రభాస్ పూరి జగన్నాథ్ ఇద్దరు మాట్లాడుకునే వారట.అయితే ఈ విషయాన్ని ప్రభాస్ మంచు లక్ష్మి హోస్టుగా చేసిన లక్ష్మీ టాక్ షో లో ప్రభాస్ ఈ విషయాన్ని బయట పెట్టారు.అలా మోహన్ బాబుని బావ అని పిలవడం బుజ్జిగాడు సినిమా నుండి అలవాటైపోయిందని ప్రభాస్ చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: