నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే నాని కెరియర్ లో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా మూవీ ఎంతో స్పెషల్. ఎందుకంటే అప్పటివరకు లవర్ బాయ్ గా మాత్రమే ప్రేక్షకులను అలరించిన నాని అటు దసరా మూవీలో మాత్రం ఇక తనలోని మాస్ యాంగిల్ ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఏకంగా తెలంగాణ యాసాలో డైలాగులు చెబుతూ అదరగొట్టేసాడు అని చెప్పాలి.



 ఇక దసరా మూవీ అటు నాని కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా కూడా నిలిచింది. అయితే గత కొంతకాలం నుంచి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయడానికి నాని సిద్ధమయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇది నిజమే అన్నట్లుగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో ఇప్పటికే దసరాతో బ్లాక్ బస్టర్ కొట్టేసిన.. ఈ కాంబో ఇప్పుడు ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయంపై అందరిలో ఎంతగానో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక అప్పుడు దసరా అనే ఒక పవర్ఫుల్ టైటిల్ పెట్టిన శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఎలాంటి టైటిల్ ప్లాన్ చేస్తున్నాడా అని తెలుసుకోవడానికి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు.


 ఇలా నాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ గురించి ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకి నాయుడు గారి తాలూకా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు ఒక టాక్ వినిపిస్తుంది. కాగా ఈ మూవీలో నాని సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధ కపూర్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నాడట. చెరుకూరి సుధాకర్ ఈ మూవీనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒక త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కపోతుంది అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: