అయినప్పటికీ శంకర్ సినిమాను రజనీకాంత్ తో చేయాలనే ఉద్దేశంతో అజిత్ తో ఈ సినిమాని క్యాన్సిల్ చేసుకున్ని మరి రజినీకాంత్ దగ్గరికి వెళ్లాడని అంటారు. ఆ తర్వాత ఈ సినిమా విడుదలై ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తెలుగు , తమిళ భాషల్లో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ సాధించింది. అయితే నిజానికి అజీత్‌తో చేస్తే తమిళంలో మాత్రమే సినిమా వర్కౌట్ అయ్యేది. తెలుగులో వర్కౌట్ అవ్వదనే ఉద్దేశంతో శంకర్ రజనీకాంత్ ఈ సినిమా చేశాడంటూ అప్పట్లో కోలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి.
ఇలా మొత్తానికి శంకర్ చేసిన ఈ సినిమా బారీ సక్సెస్ సాధించడమే కాకుండా రజినీకాంత్ కెరియర్ లో కూడా మంచి విజయం సాధించిన సినిమాగా నిలిచింది. అలానే తమిళ చిత్ర పరిశ్రమల మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా కూడా శివాజీనే.. ఆ తర్వాత శంకర్ , రజనీకాంత్ కాంబోలో 2.0 సినిమా వచ్చింది.. ఇది కూడా మంచి విజయం సాధించింది. మళ్లీ ఈ సినిమా తర్వాత శంకర్ సరైన హిట్ అందుకోలేకపోయాడు. ఈ ఏడాది కమలహాసన్ తో భారతీయుడు 2తో భారీ డిజాస్టర్ అందుకున్న శంకర్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజెర్ సినిమా పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇక మరీ శంకర్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి.