డైరెక్టర్ శంకర్ తో సినిమా అంటే నిర్మాతలు సైతం భయపడేలా చేస్తున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించాలంటే ఈ మధ్యకాలంలో చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కువగా గ్రాఫిక్స్ వంటివి ఉపయోగించడం వల్ల సినిమాలకు బడ్జెట్ పెరిగిపోయి దెబ్బ ఏసేలా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలు పెద్దగా లాభాలను తీసుకురాలేదు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలు అవ్వడం చేత చాలా సినిమాలు లాస్ అవుతున్నాయట.



ఇప్పుడు రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీది ఆశ పెట్టుకున్నారు. ఈ సినిమాని నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్లోనే నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయిందని ఇప్పటికే సినిమా విడుదల తేదీ కూడా ఆలస్యం అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ శంకర్ మాత్రం ఈ చిత్రంలోని పాటల కోసమే ఏకంగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేలా కనిపిస్తున్నారు. కోట్ల రూపాయలు సెట్స్ కి ఖర్చు పెడుతున్నారట. పాటల సెట్స్ విషయంలో ఎక్కడ డైరెక్టర్ శంకర్ రాజీ పడడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరొక పాట కోసం రూ .20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మెలోడీ సాంగ్కు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.



అయితే శంకర్ ఖర్చు చేసిన ప్రతి రూపాయి కూడా పాటలో ఫ్రేమ్లో చాలా క్లియర్ గా కనిపిస్తుందనీ ప్రేక్షకులకు ఒకసారి కొత్త అనుభూతిని ఇవ్వడంలో డైరెక్టర్ శంకర్ దిట్ట అని చెప్పవచ్చు. అయితే పాటకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అంటే పలువురు నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.. ఇప్పటికే  టికెట్ల అధిక ధరల వల్ల ప్రేక్షకులు థియేటర్లు రావడానికి భయపడుతున్నారు ఇలాంటి సమయంలో మరింత భారీ బడ్జెట్ సినిమాలు అది పాటలకు కూడా ఇన్ని కోట్లు అవసరమా అంటూ చాలామంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క పాటతో కనీసం చిన్న సినిమాలు రెండుమూడైన తీయవచ్చు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిర్మాతలు శంకర్ తో సినిమా అంటే అది రిస్క్ అయ్యేలా కనిపిస్తోంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి గేమ్ చేంజెర్ సినిమాతో  వీటన్నిటికీ శంకర్ ఫుల్ స్టాప్ పెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: