టాలీవుడ్ లో హిట్స్ అండ్ ప్లాప్ ల‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసే హీరోల లో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు .. వయసు పెరుగుతున్న ఆయన ఎనర్జీ లెవెల్స్ ఏమాత్రం తగ్గటం లేదని మాస్ మహారాజా సినిమాలు చూస్తూనే అర్థమవుతుంది. ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమా తో ప్రేక్షకులను పలకరించి రవితేజ ఇప్పుడు తన తర్వాత సినిమా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నారు . అయితే ఇప్పుడు తాజా గా సినిమాల‌ షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ హీరో ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్ళాడు .


జపాన్ , బ్యాంకాక్ తది తర దేశాల  ను చుట్టి వచ్చాడు . వాటికి సంబంధించిన ఫోటో లను కూడా సోషల్ మీడియాలో షేర్  చేశాడు రవితేజ .. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి . అయితే ఆ ఫోటోలో రవితేజ ఆయన భార్య కొడుకు కూతురు తో పాటు మరికొందరు బంధువులు కూడా ఉన్నారు . అయితే ఇప్పుడు అందరి దృష్టి మాత్రం రవితేజ కూతురు మోక్షద భూపతి రాజు పైనే ఉంది . బయట పెద్దగా కనిపించిన రవితేజ కూతురు అప్పుడప్పుడు సోషల్ మీడియా లో మాత్రం హడావుడి చేస్తూ ఉంటుంది . ఎంతో క్యూట్గా అందంగా కనిపించే మోక్షద సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు .


అయితే రవితేజ కూతురు కు మాత్రం హీరోయిన్ గా కాకుండా నిర్మాత గా మారాలని నిర్ణయించుకుందట . తండ్రి సొంత బ్యానర్నా అర్ టీ టీమ్ వర్క్స్  కాకుండా వేరే బ్యానర్ ను కూడా పెట్టబోతుందట . అందుకు రవితేజ కూడా ఒకే చెప్పినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది . మరి రవితేజ కూతురు నిర్మాత గా సక్సెస్ అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: