యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ ఓటీటీ రైట్స్ ఏకంగా 170 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. నవంబర్ నెలలో దేవర ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ విషయంలో ట్విస్టులు ఉండొచ్చు కానీ సౌత్ వెర్షన్ స్ట్రీమింగ్ కు సంబంధించి మరీ భారీ ట్విస్టులు అయితే ఉండకపోవచ్చు. అయితే దేవర సినిమా ఓటీటీ రైట్స్ కు సంబంధించి రికార్డ్స్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.
 
అయితే గేమ్ ఛేంజర్ డిజిటల్ హక్కులు కేవలం 50 కోట్ల రూపాయలకు అమ్ముడవడం ఏంటనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరిగింది. గేమ్ ఛేంజర్ హిందీ డిజిటల్ హక్కులు మాత్రమే 50 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు, తమిళ హక్కుల కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ రచ్చ వెనుక ఇన్ని షాకింగ్ ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది.
 
డిజిటల్ హక్కులను వేర్వేరు ఫ్లాట్ ఫామ్స్ కు అమ్మడం వల్లే సమస్య వచ్చిందని తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో అనే సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా రామ్ చరణ్ కు భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. రామ్ చరణ్ ఎంచుకుంటున్న కాన్సెప్ట్ లు సైతం నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లు కాగా చరణ్ సినిమా రైట్స్ అంత తక్కువకు అమ్ముడయ్యాయంటే ఎలా నమ్మారంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
గేమ్ ఛేంజర్ మూవీ ఎప్పుడు విడుదలైనా రికార్డ్స్ క్రియేట్ చేసే మూవీ అవుతుందని 2025 సంక్రాంతి పండుగ అభిమానులకు స్పెషల్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాకు తమిళనాట సైతం భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ దక్కాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. గేమ్ ఛేంజర్ మూవీని ఒకింత భారీ స్థాయిలోనే రిలీజ్ చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: