తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌లో స్టార్ మా దూకుడుకు కారణం అందులోని సీరియల్సే. సరికొత్త హంగులతో తెరకెక్కే ఆ ధారావాహికలు కుటుంబ ప్రేక్షకులను ముఖ్యంగా మహిళలను ఆకట్టుకుంటున్నాయి. గతంలో కార్తీక దీపం టీఆర్పీల దెబ్బకు స్టార్ హీరోల సినిమాలు కూడా గల్లంతయ్యాయంటే ఆ సీరియల్ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చు. కార్తీక దీపం తర్వాత రీసెంట్ డేస్‌లో బ్రహ్మముడి ఆ స్థానాన్ని ఆక్రమించిందని బుల్లితెర ఎక్స్‌పర్ట్స్ చెబుతారు. మానస్ నాగులపల్లి, దీపిక రంగరాజు ఇందులో లీడ్ రోల్స్ పోషించారు.కార్తీక దీపానికి దగ్గరిగా ఉండే బ్రహ్మముడి కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుంది. పెద్ద కుటుంబానికి చెందిన భర్త, పేదింటికి చెందిన భార్య, అహంకారి అయిన అత్తగారు మధ్యలో మారి కోడలికి అండగా నిలవడం ఇవన్నీ వంటలక్క, డాక్టర్ బాబుని గుర్తుచేస్తుంది. కాకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్ కారణంగా లేడీ ఆడియన్స్‌కి ఈ సీరియల్ తెగ నచ్చేస్తోంది.బ్రహ్మముడి సీరియల్‌లోని పాత్రధారుల పేర్లు జనంలో బాగా ఫేమస్ అయ్యాయి. రాజ్- కావ్యలు తెలుగింటికి బాగా చేరువయ్యారు. వారితో పాటు కనకం, కృష్ణమూర్తి, స్వప్న , అప్పూ, అపర్ణ, సుభాష్, ఇందిర, సీతారామయ్య, ప్రకాశం, ధాన్యలక్ష్మీ, రుద్రాణి, రాహుల్, కళ్యాణ్ , అనామిక వంటి వారు నోటెడ్ అయ్యారు. 

ముఖ్యంగా ఈ సీరియల్ హీరో హీరోయిన్లకు సమానంగా పేరు తెచ్చుకున్నారు రుద్రాణి క్యారెక్టర్ వేసిన శర్మిత గౌడ. బ్రహ్మముడిలో విలన్‌గా ఆమె అద్భుతంగా నటించారు.తనను ఆదరించిన కుటుంబంలోని వ్యక్తుల మధ్య గొడవలు పెడుతూ.. కాపురాలు కోల్పోయేలా చేసే రుద్రాణి క్యారెక్టర్‌లో షర్మిత ఒదిగిపోయారు. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందగత్తె అయిన ఈమె సీరియల్స్‌లో అమ్మ, అత్త పాత్రలలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడకపోవడం షర్మిత అంకితభావానికి నిదర్శనం. ఆమె వయసు కేవలం 34 ఏళ్లే.. కర్ణాటకకు చెందిన షర్మిత 1990 నవంబర్ 20న జన్మించారు. మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె 2017లో మిస్ కర్ణాటక టైటిల్ విన్నర్ కావడం విశేషం.ఈ ఫేమ్‌తో పలు కన్నడ, తమిళ్ సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షర్మిత.. బ్రహ్మముడి ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తన సీరియల్స్ , ఇతర వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో పార్టీకి వెళ్లిన షర్మిత గౌడ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో పొట్టి గౌనులో కాలు మీద కాలు వేసుకుని, నల్ల కళ్లజోడు పెట్టి స్టైలీష్‌గా కనిపిస్తున్నారు షర్మిత. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో చూసేందుకు హీరోయిన్ లా ఉండే ఈ భామ.. సీరియల్స్ లో మాత్రం సీనియర్ నటిగా అమ్మ, అత్త పాత్రలలో నటించడం కొందరు అభిమానులకు అసలు నచ్చడం లేదు. షర్మిత గౌడ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: