అయితే వాళ్లందరిలోకి సో సో స్పెషల్ మన రామ్ చరణ్ . పాన్ ఇండియా స్ధాయి లో సినిమాలు చేస్తూ.. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న రామ్ చరణ్ కూడా ఈ జనరేషన్ కి సంబంధించిన అబ్బాయే . కానీ ఎక్కడా కూడా తన భార్య ఉపాసనతో టూ గా హద్దులు మీరి ప్రవర్తించిన దాఖలాలు లేవు . అంతేకాదు రామ్ చరణ్ - ఉపాసన ఎంతో మంది జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు.
రామ్ చరణ్ తన భార్య ఉపాసనను ముద్దుగా ఏమని పిలుస్తాడు అనే వార్త ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. రామ్ చరణ్ తన భార్య ఉపాసనను "ఉప్సి - ఉప్సి - ఉప్సి" అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారట. ఫోన్లో కూడా అదే పేరుతో సేవ్ చేసుకున్నాడట. మొదటి నుంచి రామ్ చరణ్ కి ఉపాసనను అలా పిలవడమే ఇష్టమట . ఆశ్చర్యం ఏంటంటే మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఎంతో ప్రేమగా ఉపాసనను ఉప్సి అనే పిలుస్తుంది . చిరంజీవి ఒక్కడే ఉపాసన తల్లి అంటూ ఎంతో ప్రేమగా పిలుస్తాడట . అలాంటి ఒక స్పెషల్ స్థానాన్ని సంపాదించుకుంది ఉపాసన మెగా కుటుంబంలో. ఇలాంటి కోడలు అందరి ఇంటికి రావాలి అంటూ చాలామంది మెగా ఫాన్స్ కూడా మెచ్చుకుంటూ ఉంటారు . ఉపాసన తల్లిదండ్రులకు ఎంత గౌరవం ఇస్తుందో తన అత్తమామలకు అంతే గౌరవం ఇస్తుంది..!