ఇద్దరు మొదటి నుంచి మంచి స్నేహితులు కానీ చిన్న విషయం కారణంగా వీళ్ళ మధ్య గొడవ వచ్చింది . అలా మళ్లీ వీరి జీవితంలో ఎప్పుడు కలిసి సినిమా చేయలేదు . ఎన్టీఆర్ సాధారణంగా తనకి ఎవరైనా అడ్డు చెబితే లేదా నచ్చని పని చేస్తే దూరం పెట్టేస్తారు . అలాంటి ఒక చిన్న కారణమే వీళ్ళిద్దరి మధ్య సమస్యకు కారణమైంది . ఇక వాస్తవానికి విశ్వనాధ్ , ఎన్టీఆర్ ఇద్దరు కాలేజీల్లో కలిసి చదువుకున్నారు.
ఇక దర్శకుడు విశ్వనాథ్ కాలేజీలో ఉన్న టైంలోనే ఎన్టీఆర్‌కు ఉద్యోగం వచ్చింది . ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఇద్దరూ వచ్చారు . అయితే ఒక్కరోజు ఎన్టీఆర్ హీరోగా విశ్వనాధ్ దర్శకుడుగా పనిచేస్తున్న సినిమా కి ఎమోషనల్ సీన్ తెర్కెక్కించే సమయంలో గ్లాస్ పెట్టుకొని సీన్ చేయొద్దని విశ్వనాథ్ ఎన్టీఆర్ తో అన్నారు .. అన్నగారి కి నచ్చలేదు నాకు ఇలానే బాగుంది నేను ఇలానే చేస్తానని ఆయన అన్నారు . అయితే విశ్వనాథ్ కు మాత్రం ఆ విషయం ఎంతకూ నచ్చలేదు . ఇలా వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయి గొడవ జరిగిన తర్వాత ఎన్టీఆర్ కళ్లద్దాలతోనే సినిమాలో నటించరు.. అలా దాదాపు 20 ఏళ్లకు పైగా వీళ్ళు ఈ విషయం వలన మాట్లాడుకోలేదట.