ముఖ్యంగా ట్రైలర్ విషయానికి వస్తే చదువు ప్రాముఖ్యతను సైతం వివరిస్తూ ఒక మంచి మెసేజ్ కంటెంట్తో ఈ పొట్టేల్ సినిమాని తీసినట్లుగా కనిపిస్తోంది. చదువు కుంటే భవిష్యత్తు ఉంటుందని నమ్మిన నిరుపేద గ్రామస్తుడు ఆయన కూతురు విద్యను అభ్యసించమని పంతులు దగ్గరికి అడుగుతారు.. కానీ ఆ ఊరిలో పేద ధనికా మధ్య చాలా వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటాయి ముఖ్యంగా గ్రామ దేవతకు బలి ఇవ్వడానికి ఒక పొట్టేల్నీ విడిచినప్పుడు ఆ పొట్టేలు మిస్ అవ్వడంతో ఒక్కసారిగా యువచంద్ర జీవితం మలుపు తిరిగినట్టుగా కనిపిస్తోంది.. అలాగే గొర్రెల కాపరిగా ఇందులో యువచంద్ర నటించారు.
తన కూతురిని చదివించాలని ఒకవైపు తపన అలాగే తన భార్యను (అనన్య నాగళ్ళ) బాగా చూసుకోవాలని తపన.. పొట్టేల్ తప్పిపోవడంతో ఊర్లో జనాలు అంతా కూడా తనని నిందిస్తూ ఉంటారు. ఆ సమయంలో తన కుటుంబంతో కలిసి పారిపోవాలనుకున్న సమయంలో ఎదురయ్యే పరిస్థితులని ఈ ట్రైలర్లు చూపించారు. చివరిలో పొట్టేల్ కి బదులుగా తన కూతురిని బలివ్వడానికి తీసుకువెళుతున్నట్లయితే చూపించారు.. మొత్తానికి ఇందులో రా అండ్ రస్టిక్ యాక్షన్ చిత్రంగా కనిపిస్తోంది ట్రైలర్ తో ఉత్కంఠ భరిస్తున్న ఈ పొట్టేల్ ట్రైలర్ .. అనన్య నాగళ్ళ కెరియర్ని మార్చేలా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో డీ గ్లామరస్ గా కనిపిస్తోంది. మరి పూర్తి సినిమా రావాలి అంటే అక్టోబర్ 25 వరకు ఆగాల్సిందే.