ఇప్పుడు సోషల్ మీడియాలో.. సినిమా ఇండస్ట్రీలో ..పొలిటికల్ పరంగా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేర్లు బన్నీ - పవన్ కళ్యాణ్ . వీళ్ళిద్దరూ బంధువులే ..అయినప్పటికీ వీళ్లిద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువులుగా మారిపోతున్నారు అంటూ గతంలో జరిగిన సిచువేషన్ కారణంగా ఫ్యాన్స్ భావిస్తున్నారు . జనసేన తరఫున ప్రచారం చేయకుండా వైసిపి నేతకు బన్నీ సపోర్ట్ చేయడమే ఇప్పుడు బన్నీ కెరీర్ ని చిక్కుల్లో పడేసేలా చేసింది . మరీ ముఖ్యంగా కొంతమంది ఓపెన్ గానే పుష్ప 2 సినిమాను అడ్డుకుంటామని ఫ్లాప్ చేస్తామని చెప్పుకొస్తున్నారు.  అయితే పుష్ప2 మీద బన్నీ ఒక్కడే కాదు చాలామంది హోప్స్ పెట్టుకొని ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాపై సుకుమార్ ఎంతలా ఆశలు పెట్టుకొని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .


వాళ్ళకి జరిగిన గొడవల కారణంగా సుకుమార్ బలవ్వడం కూడా చాలా మందికి ఇష్టం లేదు . మరీ ముఖ్యంగా బన్నీతో నెక్స్ట్ సినిమాకి కమిట్ అయిన డైరెక్టర్ ముందు నుంచే పక్క ప్లాన్ తో దూసుకుపోతూ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే బన్నీ నెక్స్ట్ కమిట్ అయినా మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చాలా పక్కా ప్లాన్ వేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ఎంత జాన్ జిగిడి దోస్తులో అందరికీ తెలిసిందే.  త్రివిక్రమ్ ఆల్రెడీ బన్నీతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.



పుష్ప2 అయిపోగానే ఆ సినిమాని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . అయితే బన్నీకి పవన్ కళ్యాణ్ కి మధ్య పడడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఫ్యాన్స్ కూడా ఎక్కడ తగ్గడం లేదు . ఈ క్రమంలోనే బన్నీ - పవన్ కళ్యాణ్ ని కలపడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాడట త్రివిక్రమ్ . అంతేకాదు వీళ్లిద్దరిని పర్సనల్గా మీట్ చేసి మరి ప్రాబ్లం సాల్వ్ చేయాలనుకుంటున్నారట . తద్వారా తన సినిమాకి కూడా ఎటువంటి అడ్డంకులు రావు అనేది త్రివిక్రమ్ ఆలోచన .అయితే ఫ్యాన్స్ ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అన్నది అర్థం కావడం లేదు. అసలు బన్నీ - పవన్ కళ్యాణ్ మీట్ అవుతారా అన్నది కూడా ప్రశ్నార్ధకంగానే ఉంది . అంతేకాదు అన్ స్టాపబుల్ సీజన్లో పవన్ కళ్యాణ్ గురించి  బన్నీ మాట్లాడాడు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి . వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలి అంటే బన్నీ - పవన్ కళ్యాణ్ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫాన్స్ కు ఒక క్లారిటీ ఇవ్వాల్సిందే..!!


మరింత సమాచారం తెలుసుకోండి: