ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ పై దండయాత్ర చేస్తున్నారు. మన టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ పై చేస్తున్న దండయాత్ర దెబ్బకు అక్కడ స్టార్ హీరోలు సైతం బెంబేలు ఎత్తుతున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమాలో బాలీవుడ్ దే రాజ్యం. వాళ్ళు ఎంత చెప్తే అంత .. అయితే కొన్నేళ్లుగా సీను మారుతుంది. ఆధిపత్యం పూర్తిగా టాలీవుడ్ చేతుల్లోకి వచ్చేస్తుంది. బాక్సాఫీస్ దగ్గర మన హీరోల చేతలు కూడా అలాగే ఉంటున్నాయి. బాలీవుడ్ లో గొప్పలుగా చెప్పుకునే ఖాన్స్ తో సహా హృతిక్ రోషన్ - రణవీర్ సింగ్ లాంటి హీరోలు సైతం ఇప్పుడు మన టాలీవుడ్ హీరోల దెబ్బకు బెంబేలెత్తుతున్నారు. బాలీవుడ్ మీద కూడా మనకు హీరోలు జెండా పాతిస్తున్నారు.


2023లో కనీసం గదర్ 2 - జవాన్ - పఠాన్ - యానిమల్ లాంటి సినిమాలు రప్ఫాడించాయి. 2024లో అయితే మరీ దారుణం అని చెప్పాలి. ఇప్ప‌టికే 10 నెల‌లు గ‌డిచి పోయింది. ఒక్క స్త్రీ 2 మినహాయిస్తే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా ఒక్కటి అంటే ఒక్క‌టీ లేదు. మధ్యమధ్యలో హనుమాన్, కల్కితో పాటు రీసెంట్‌గా దేవర అంటూ మన టాలీవుడ్‌ హీరోలే అక్కడి బాక్సాఫీస్‌కు అండగా నిలిచాయి అంటే బాలీవుడ్ లో ప‌రిస్థితి ఈ యేడాది ఎంత‌కు దిగ‌జారిపోయిందో తెలుస్తోంది.


అయితే ఇప్పుడు మాత్ర‌మే కాదు... స‌మీప భ‌విష్య‌త్తు లో కొన్నేళ్ల పాటు ఇదే జరిగేలా కనిపిస్తుంది. 2025లోనూ బాలీవుడ్ లో అయితే భారీ సినిమాలేం వచ్చేలా లేవు. కండ‌ల వీరుడు... ఖాన్ దాదా అయిన సల్మాన్ ఖాన్ సికిందర్ వస్తున్నా.. మునపట్లా భాయ్ మ్యాజిక్ చేస్తారా అన్న అనుమానాలు చాలా ఎక్కువ గానే ఉన్నాయి. ఇక అక్షయ్ కుమార్, అజయ్ దేవ్‌గన్ లాంటి హీరోల మార్కెట్ ఇప్పటికే చాలా డౌన్ అయిపోయిందంటే న‌మ్మాల్సిందే.. వీళ్ల సినిమాలు వస్తున్నాయంటే మినిమం ఓపెనింగ్స్ డౌటే.


ఇక‌ వార్ 2 ఒక్కటే కాస్త ప్రామిసింగ్‌గా కనిపిస్తుంది.. అందులోనూ హృతిక్ రోషన్‌తో పాటు మన జూనియర్ ఎన్టీఆర్ ఉండ‌డంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచ‌నాలు ఉన్నాయి. ఇక  డిసెంబర్ 6న పుష్ప 2తో బాలీవుడ్‌ను రూల్ చేయడానికి బయల్దేరుతున్నారు బన్నీ. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్ రాబోతున్నారు. ప్ర‌భాస్ స్పిరిట్‌.. ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా.. స‌లార్ 2 ఇలా చాలా సినిమాలు బాలీవుడ్‌ను వ‌చ్చే రెండేళ్ల‌లో క‌మ్మేయ‌బోతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: