హనుమాన్ సినిమా సక్సెస్ తో ప్రశాంత్ వర్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కింది. స్టార్ హీరోలు, యంగ్ హీరోలు ప్రశాంత్ వర్మతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్లు సైతం ప్రశాంత్ వర్మతో సినిమా నిర్మిస్తే తమ దశ తిరిగినట్టేనని ఫీలవుతున్నారు. అయితే ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా అంటూ వస్తున్న వార్తలు ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
అయితే ప్రశాంత్ వర్మ ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. కొన్ని సినిమాలు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా మరికొన్ని సినిమాలు ప్రశాంత్ వర్మ శిష్యుల డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి. ప్రశాంత్ వర్మ కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రభాస్ తో సినిమా అంటే ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుతుందనే చర్చ జోరుగా జరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం వైరల్ వార్తల్లో నిజం లేదని ఎవరో కావాలని ఈ తరహా వార్తలు ప్రచారంలోకి తెచ్చారని చెబుతున్నారు. ప్రభాస్ లేదా ప్రశాంత్ వర్మ స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే భవిష్యత్తులో ఈ కాంబో సాధ్యమయ్యే ఛాన్స్ ఉంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాకు సంబంధించి ఏవైనా అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.