రాజ్ కుమార్ స్వయంగా మూడు పాత్రలు ఆయనే వేశారు. తర్వాత కాలంలో తమిళంలో త్రిశూలం పేరుతో ఈ సినిమా రీమేక్ అయింది. శివాజీ గణేషన్ ఇందులో నటించారు. హిందీలో అమితాబచ్చన్ మూడు పాత్రలు వేశారు. అక్కడ వహీదా రెహమాన్, పర్వీన్ బాబి, జీనత్ అమన్ హీరోయిన్గా నటించారు. ఇక మన తెలుగులో ఇదే సినిమా కృష్ణతో రీమేక్ చేశారు. మూడు పాత్రలు కృష్ణ పోషించారు. పెద్ద కృష్ణుడికి జంటగా జయంతి జోడిగా నటించారు. ఇద్దరు చిన్నకృష్ణులకు జంటగా జయప్రద, లతా నటించారు.
అడవి రాముడు సినిమా తెరకెక్కించిన సత్య చిత్ర బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కింది. పర్వతనేని సాంబశివరావు దర్శకుడు. కృష్ణ మూడు పాత్రలు చాలా బాగా నటించారు. ఈ సినిమాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. చాలా బాగం కశ్మీర్లో షూటింగ్ చేశారు. జంధ్యాల డైలాగులు అదిరిపోయాయి. అడవి రాముడు తర్వాత ఇది ఆయనకు రెండో సినిమా. డైలాగులు బాగా పేలాయి. కె.వి.మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన పాటలు బయట అయితే పెద్దగా క్లిక్ కాలేదు. కాగా రొటీన్ కథ అయిన కృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేయటం ప్రేక్షకులకు మంచి కేక్ ఇచ్చి సినిమాను సూపర్ హిట్ చేసింది. ఆ రోజుల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది.