డైరెక్టర్స్ కి కొత్త కథలు తట్టడం లేదో.. లేకపోతే కొత్తగా సరికొత్త కంటెంట్ ను తెరకెక్కిస్తే జనాలు లైక్ చేయడం లేదో.. రీజన్ ఏంటో తెలియదు కానీ కొంతమంది డైరెక్టర్ లు కొత్త కథలను చూస్ చేసుకోకుండా ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అలాగే వాటికి రీమేక్ సినిమాలను తెరకెక్కిస్తూ ఆనంద పడుతున్నారు . ఈ మధ్యకాలంలో చాలా చాలా సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి . అలాగే రీమేక్ లు కూడా చేస్తున్నారు . కాగా ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి సరికొత్త డిమాండ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది . అన్ని సినిమాలకు సీక్వెల్స్ వస్తున్నాయి ..అన్ని సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు .


అయితే మహేష్ బాబు నటించిన మురారి సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుంది అంటూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నే ఈ మురారి.  ఎంత పెద్ద హిట్ అయింది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  ఈ సినిమా తెలుగు రికార్డ్స్ ను తిరగరాసింది . అయితే అలాంటి ఒక సినిమా ఇప్పుడు సీక్వెల్ వస్తే కచ్చితంగా ఫ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ చేస్తారు అంటున్నారు జనాలు .



అయితే మహేష్ బాబు కాకుండా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అదే విధంగా సోనాలి బింద్రే పాత్రలో  హీరోయిన్ శ్రీలీల నటిస్తే చాలా బాగుంటుంది అని.. బావ మరదలు పాత్రలకు వాళ్ళు బాగా సూట్ అవుతారు అని చెప్పుకు వస్తున్నారు.  చూద్దాం మరి కృష్ణవంశీ మురారి సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తాడో..?  లేకపోతే ఈ బాధ్యతలను వేరే డైరెక్టర్ చేతిలో పెడతాడో. ఒకటి మాత్రం నిజం మురారి సినిమాకు సీక్వెల్ వచ్చిన మురారి సినిమా అంత హిట్ అయితే కాదు . కొన్ని కొన్ని సినిమాలు అలా చరిత్రలో నిలిచిపోతూ ఉంటాయి. వాటికి సీక్వెల్స్ తీసుకురావాలి రీమేక్  చేయాలి అన్న ఆలోచన వస్తే అది ముందు సినిమా కన్న హిట్ అవుతాయి అన్న హోప్స్ ఎక్కువ పెట్టుకోకూడదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: