సినిమా రంగంలో అప్పటికే పిల్లలున్న వారితో ప్రేమలో పడటం చాలా కామన్. ఎంతోమంది హీరోయిన్లు పెళ్థై, పిల్లలు ఉన్న హీరోలతో, దర్శకులతో ప్రేమలో పడ్డారు. ఇలాంటి వారిలో కొందరు సక్సెస్ అయితే.. కొందరు తమ కెరీర్ నాశనం చేసుకున్న వారు కూడా ఉన్నారు. నువ్వు అడిగింది ఏనాడైనా కాదన్నానా..? నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా..? ఈ పాట ఒకప్పుడు తెలుగు ప్రజలను ఒక ఊపు ఊపేసింది. ఇది మాత్రమే కాదు.. నువ్వు లేవ‌నంటావా.. నన్ను లేపమంటావా.. అనే పాట కూడా ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేసింది.


ఇలాంటి అనేక పాటలు పాడిన ప్రముఖ గాయకురాలు ఎల్.ఆర్.ఈశ్వరి వాస్తవానికి ఆమె తమిళ అమ్మాయి. అయితే అగ్ర దర్శకుడు కే. బాలచంద‌ర్‌ ప్రోత్సాహంతో ఆమె తెలుగులోనూ అనేక పాటలు పాడారు. ఏ పాటలో అయినా లీనం కావడంతో పాటు.. పాటను హైలైట్ చేయటం ఈశ్వరి ప్రత్యేకత. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. ఆమె ఎవరిని అయితే నమ్మిందో.. ఆ వ్యక్తి ఈశ్వ‌రికి హ్యాండ్ ఇచ్చాడు. దీంతో జీవితాంతం ఈశ్వరి ఆయన జ్ఞాపకాల్లో ఉండిపోయింది.


18 ఏళ్ళ వయసులో గాయకురాలిగా అరంగేట్రం చేసిన ఈశ్వరి.. తమిళంలో సూపర్ డూపర్ హిట్ పాటలు ఎన్నో పాడింది. ఈ క్రమంలోనే ఆమెకే ఉచ్చ దశలో ఉన్నప్పుడు ఓ అగ్ర దర్శకుడు పరిచయం కావడంతో.. అనేక సినిమాలు ఆమెకు క్యూ క‌ట్టాయి. ఒక సినిమాలో హీరోయిన్ పాత్ర వచ్చిన కూడా.. ఆమె తిరస్కరించారు. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రకు మాత్రమే ఆమె పరిమితమయ్యారు. ఇది వ్యక్తిగత జీవితాన్ని చూస్తే.. గాయకరాలగా ఆమె ఉన్నత స్థాయికి చేరుకున్న సమయంలో.. ఓ డైరెక్టర్ తో ఆమె ప్రేమలో పడ్డారు. ఆయనను పూర్తిగా నమ్మారు. వీరిద్దరూ ఏకాంతంగా గడిపే వారిని కూడా అప్పట్లో తమిళ్ మీడియా కూడా కూసింది.


అప్పటికే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న ఆ డైరెక్టర్.. చివరకు ఈశ్వరిని వదిలించుకోవడంతో ఆమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా ఆమె సినియా రంగానికి దూరంగా ఉన్నారు. ఒకానొక దశలో సన్యాసం తీసుకునేందుకు రెడీ అయ్యారు. చివరకు అతికష్టం మీద తనను తాను నిలదొక్కుకున్నారు. ఏది ఏమైనా సినీవారం అనేది ఆకర్షణల మాయాజాలం. కొత్తగా ఈ రంగంలోకి వ‌చ్చేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఈశ్వరి తన జీవితం చివరి వరకు కూడా చెప్పేవారట.
 

మరింత సమాచారం తెలుసుకోండి: