ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతున్నాయి. ప్రశాంత్ వర్మ అనగానే ఒకప్పుడు చాలా చాలా సైలెంట్ పర్సన్ అనేవారు అంత కానీ ఎప్పుడైతే హనుమాన్ సినిమాతో హిట్టు కొట్టాడొ అప్పటినుంచి సైలెంట్ కిల్లర్ అంటూ ట్యాగ్ చేయించుకున్నాడు . అయితే రీసెంట్ గానే ప్రశాంత్ వర్మకు బాలయ్య కొత్త బాధ్యతలను అప్పజెప్పిన విషయం అందరికీ తెలిసిందే . ప్రశాంత్ వర్మ బాలయ్య కొడుకు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు . మోక్షజ్ఞ డెబ్యూని ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టాడు బాలయ్య . ఆయన డైరెక్షన్లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది.  ప్రెసెంట్ ఇప్పుడు ప్రశాంత్ గారు పూర్తి ఫోకస్ మోక్షజ్ఞ పైన చేయాలి అంటూ బాలయ్య కూడా స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారట .


అయితే సడన్గా తెర పైకి ప్రభాస్ తో సినిమా  అంటూ తెర పైకి ఓ న్యూస్ వచ్చింది . డార్లింగ్ ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ప్రశాంత్ వర్మ కాల్ షీట్స్ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇక మన డార్లింగ్ ప్రభాస్ గురించి అయితే చెప్పనవసరం లేదు . నాలుగేళ్ల వరకు ఒక్క కాల్ షీట్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి మూమెంట్లో వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమానా..? అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేయగలిగారు అంటున్నారు ఫ్యాన్స్.



అయితే నిజంగానే వీళ్ళ  కాంబోలో ఒక సినిమా రావాలి అంటే దాదాపు నాలుగేళ్లు వేచి చూడాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.  ప్రభాస్ ఇప్పుడు ది రాజా సాబ్ అలాగే సలార్ 2 సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు . ఆ తర్వాత ఫౌజీ .. ఆ తర్వాత స్పిరిట్.. ఆ తర్వాత కల్కి 2 సినిమాలకు కాల్ షీట్స్ ఇచ్చేశారు . ఇవన్నీ ఫినిష్ అవ్వాలి అంటే మరో నాలుగేళ్లు అయినా పడుతుంది . ఆ నాలుగేళ్ల తర్వాతనే ప్రశాంత్ వర్మతో డార్లింగ్ సినిమా ఉందచ్చు అని నమ్మొచ్చు.  అయితే ఇప్పుడప్పుడే వీళ్ళకాంబోలో సినిమా అంటే మాత్రం అది ఒట్టి పుకారని అనుకోవాలి. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. అసలు ప్రశాంత్ వర్మ ఎలా ప్రభాస్ తో సినిమాను తెరకెక్కిస్తాడు ..? ఇప్పుడు మోక్షజ్ఞ పైన పూర్తి ఫోకస్ చేయమని బాలకృష్ణ చెప్పారుగా..? అంటూ మాట్లాడుకుంటున్నారు . మొత్తానికి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో నందమూరి ఫ్యాన్స్ కోసం గట్టిగానే ఫోకస్ చేశారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: