టాప్ హీరోల సినిమాలు డివైడ్ టాక్ తెచ్చుకోవడం సాధారణమైన విషయంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితులలో సినిమా ఎంత బాగున్నప్పటికీ నెగిటివ్ టాక్ ను తట్టుకుని నిలబడాలి అంటే ఆమూవీలో చాల విషయం ఉండవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డివైడ్ టాక్ ను తట్టుకుని ‘దేవర’ పరిస్థితులు అనుకూలించడంతో ఆమూవీ బయ్యర్లు గట్టెక్కడమే కాకుండా కొన్ని చోట్ల లాభాల బాట పట్టారు అన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి.
టాప్ హీరోల సినిమాల పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ చేయడం సెటైర్లు వేయడం ఒక సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. దీనికితోడు కొన్ని కారణాలతో ఈమధ్య బన్నీ పై సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ పెరిగిపోతోంది. కొందరు టాప్ హీరోల అభిమానులు పనికట్టుకుని బన్నీని సోషల్ మీడియాలో టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్లు సంకేతాలు ఉన్నాయి.
ఇన్ని వ్యతిరేక పరిస్థితులు తట్టుకుని ‘పుష్ప 2’ కలక్షన్స్ విషయంలో నిలబడాలి అంటే ఈమూవీ పై వస్తున్న అంచనాలు ఎంతోకొంత అందుకోవాలని లేకపోతే అత్యంత భారీ రేట్లకు ఈ మూవీ కొనుక్కున్న బయ్యర్లకు కష్టకాలం ఎదురయ్యే ఆస్కారం ఉంది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇది ఇలా ఉండగా ‘పుష్ప 2’ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఈమూవీ ప్రమోషన్ ను రోజురోజుకు పెంచి ఈమూవీ పై మరింత అంచనాలు పెంచుతున్నారు. దీనితో ఈమూవీ టాక్ తో సంబంధం లేకుండా వచ్చే ఫస్ట్ వీకెండ్ కలక్షన్స్ ఈమూవీ విజయానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. మరి ప్రేక్షకుల తీర్పు ఏవిధంగా ఉంటుందో ఉండాలి..