టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో దర్శక ధీరుడు రాజమౌళి ఒకరు. ఈయన ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఏ సినిమా కూడా కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ , అంతకుమించిన విజయాలను అందుకున్నాయి. దానితో రాజమౌళి కి తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉంది. ఇకపోతే బాహుబలి సినిమాతో రాజమౌళి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే ఈయన సినిమా వస్తుంది అంటే చాలు ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే స్థాయికి రాజమౌళి ఎదిగాడు.

దానితో రాజమౌళి సినిమాలకు ఫ్రీ రిలీజ్ బిజినెస్లు కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతూ ఉంటాయి. దానితో చాలా మంది కూడా ఇప్పట్లో రాజమౌళి సినిమాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ల దగ్గరికి ఏ దర్శకుడి సినిమా కూడా వెళ్లలేదు అనే భావనకు చాలా మంది వచ్చారు. కానీ సుకుమార్ మాత్రం దాదాపు రాజమౌళి కి దగ్గరగా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 1 మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా అదిరిపోయి రేంజ్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప పార్ట్ 2 మూవీ ని డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ కి దేశ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ బిజినెస్లు అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆల్మోస్ట్ రాజమౌళి గత సినిమా అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు దగ్గరగా పుష్ప పార్ట్ 2 మూవీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: