ఈ మధ్య కాలంలో చాలా సినిమాలను విడుదలకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్స్ పేరుతో కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఒక లాభం , ఒక నష్టం ఉంది. లాభం విషయానికి వస్తే ... చిన్న సినిమాలకు పెద్దగా క్రేజ్ లేని సినిమాలను థియేటర్లకు వెళ్లి సినిమాను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇష్టపడరు. అలాంటి సినిమాలను ఒక రోజు ముందే కొన్ని ప్రాంతాల్లో విడుదల చేసినట్లయితే వాటి ద్వారా సినిమాకు మంచి టాక్ వస్తే సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

ఒక వేళ పెయింట్ ప్రీమియర్స్ ద్వారా మూవీ కి  కనుక నెగిటివ్ తక్ వచ్చినట్లయితే ఆ సినిమాకు మొదటి రోజు వచ్చే కలెక్షన్లు కూడా రాకుండా పోతాయి. అయినప్పటికీ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలకు విడుదలకు ఒక రోజు ముందు , అంత కన్నా చాలా రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించిన సినిమాలు అనేకం ఉన్నాయి. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా అక్టోబర్ 31 వ తేదీన కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన "క" మూవీ ని దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందిన లక్కీ భాస్కర్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇకపోతే ఈ రెండు సినిమాలకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ని కూడా విడుదలకు ఒక రోజు ముందే ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక లక్కీ భాస్కర్ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను అక్టోబర్ 30 వ తేదీన ఈవినింగ్ షోస్ నుండే ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పెయిడ్ ప్రీమియర్ ద్వారా ఈ మూవీలకి ఒక మంచి టాక్ వస్తే ఓకే ... కానీ నెగిటివ్ టాక్ వచ్చినట్లయితే ఈ మూవీలకి మొదటి రోజు వచ్చే కలెక్షన్లపై ఆ ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: