తెలుగు సినీ పరిశ్రమ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకుడి గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించి న వారిలో ఎస్వీ కృష్ణా రెడ్డి ఒకరు . ఈయన ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో గొప్ప దర్శకుడిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు . అలా గే ఈయన దర్శకత్వం వహించిన దాదాపు అన్ని సినిమాలకు ఈయ నే సంగీతాన్ని అందించాడు . కృష్ణా రెడ్డి అందించి న సంగీతం కూడా ఈయన దర్శకత్వం వహించి న ఎన్నో సినిమాల విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించడం తో సంగీత దర్శకుడి గా కూడా ఎస్ వి కృష్ణా రెడ్డి అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు. 

ఇకపోతే ఎస్ వి కృష్ణా రెడ్డి కొన్ని సినిమాల్లో నటించి నటుడిగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఎస్వీ కృష్ణా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఈయనకు మెగాస్టార్ చిరంజీవి తో మీరు ఎందుకు సినిమా చేయలేదు అనే ప్రశ్న ఎదురయింది. దానికి ఎస్వీ కృష్ణా రెడ్డి సమాధానం చెబుతూ ... మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు ఎంతో గౌరవం. ఆయనతో సినిమా చేయాలి అని నేను ప్రయత్నించాను. అందులో భాగంగా అతనికి రెండు స్టోరీలు కూడా వినిపించాను. 

ఒక స్టోరీ ఆ సమయంలో చాలా అడ్వాన్స్ గా ఉండేది. అలాంటి సినిమా ఆ టైం లో వర్కౌట్ అవుతుందా అనే అనుమానంతో దానిని చిరంజీవి రిజెక్ట్ చేశాడు. ఇంకో స్టోరీ కూడా చిరంజీవి కి వినిపించాను. కానీ అది కూడా చిరంజీవి కి నచ్చలేదు. అలా చిరంజీవి తో సినిమా చేయాలి అని ప్రయత్నించిన కుదరలేదు అని ఎస్ వి కృష్ణా రెడ్డి తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: