పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేసి సూపర్ హిట్ లు అందుకున్నారు. అలాగే ఆయన కెరీర్‌లో కొన్ని క్రేజీ కాంబినేషన్లు కూడా మిస్ అయ్యాడ‌నే విషయం అందరికీ తెలిసిందే. మన సౌత్ ఇండియాలోనే మణిరత్నం , శంకర్ , రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. కానీ పవన్ మాత్రం వాళ్లకు నో చెప్పి తనకు కావాల్సిన దర్శకులతో సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆయన కెరీర్ మొత్తం మీద ఆయన పనిచేసిన స్టార్ దర్శకులు కేవలం ఇద్ద‌రు మాత్రమే..  ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా మరొకరు పూరి జగన్నాథ్.. అలాగే పూరిని టాలీవుడ్‌కు డైరెక్టర్గా పరిచయం చేసింది కూడా పవన్ కళ్యాణ్‌నే.. ఆయన స్టార్‌ డైరెక్టర్ గా ఎదిగిన తర్వాత కెమెరామాన్ గంగతో రాంబాబు సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి టాక్‌ తెచ్చుకుంది.


అయితే అంతకు ముందు పవన్ కి ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి,  పోకిరి,  గోలీమార్ వంటి కథలు వినిపించారు పూరి.. ఎందుకో పవన్ ఆ సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ సినిమాలు వేరే హీరోలు చేస్తే ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అదే విధంగా పవన్ కళ్యాణ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కాంబినేషన్లో కూడా గతంలో ఒక సినిమా సెట్ అయింది.. కానీ ఆమెకు డేట్స్‌ సర్దుబాటు కాక ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ సినిమా మరేదో కాదు తీన్‌మార్.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయినా సైఫ్ అలీ ఖాన్ లవ్ ఆజ్క‌ల్ అనే సినిమాకి రీమేక్ గా ఇది టాలీవుడ్ లో పవన్ హీరోగా తెరకెక్కించారు.


అయితే అప్పటికే ఈ సినిమా బాగా అడ్వాన్స్ గా ఉండటంతో కమర్షియల్ గా అట్టర్ ప్లాప్‌ అయింది.అయితే ఈ సినిమాలో ముందుగా దీపికా పదుకొనేను హీరోయిన్గా అనుకున్నారు. ఆమె కూడా సినిమా చేయడానికి ఒకే చెప్పిన అయితే సినిమాను అనుకున్న సమయంలో ప్రారంభించలేకపోయారు నిర్మాత బండ్ల గణేష్ . ఇక దీంతో దీపికా పదుకొనే కి డేట్స్ సమస్య రావడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత త్రిష‌ను హీరోయిన్గా తీసుకున్నారు. అలా ఈ క్రేజీ కాంబినేషన్ మిస్సయింది. ఇక మరి రాబోయే రోజుల్లో అయినా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: