టాలీవుడ్ ప్రముఖ ఆర్జే బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ భాష  అరెస్ట్ అయ్యాడంటూ ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది . యూట్యూబర్‌ హర్ష సాయి తనని మోసం చేశాడని మిత్ర శర్మ కేసు పెట్టిన విషయం తెలిసిందే . ఇక ఈ విషయం లోనే తనపై శేఖర్ బాషా అసత్య వార్తలు ప్రచారం చేస్తున్నార ని కొంతమంది యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చి మరి తన పై పుకార్లు పుట్టిస్తున్నార ని మిత్ర శర్మ పోలీసుల కు కంప్లైంట్ చేసినట్టు .. ఇక కంప్లైంట్ మేరకు శేఖర్ బాషా ని అరెస్ట్ చేశారన్నది ఆ వార్తల సారాంశం ..


ఇక దీనిపై శేఖర్ భాష కూడా స్పందించాడు ..  తనని ఎవరు అరెస్టు చేయలేదని ఇదంతా ఫేక్ ప్రచారమని ఆయన తిప్పుకొట్టారు .. ఈ మేరకు ఓ వీడియోని కూడా ఆయన విడుదల చేశారు .. ప్రో కబడ్డీ ప్రమోషన్ల నిమిత్తం ఈరోజు ఉదయం నుంచి గచ్చిబౌలి స్టేడియం కి వెళ్ళానని అక్కడ తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఆ తర్వాత ఇంటి కి వచ్చి చూస్తే మూడు గంటల్లో నానా రచ్చ అయినట్లు తెలిసిందని .. ఇలాంటి ఫేక్ వార్తల ను ఎవరు నమ్మొద్ద ని కూడా కోరారు ..  


అంతేకాకుండా సాక్ష్యంగా మళ్ళీ తన పాత వీడియో అనుకుంటారు . కావాలంటే ఈరోజు న్యూస్ పేపర్ చూడండి అంటూ కూడా ఆ వీడియో లో చూపించారు . రాజ్‌ తరుణ్ వ్యవహారం లో బయటకు వచ్చి రాజ్ తరుణ్ తరఫున మాట్లాడిన శేకర్ భాష .. ఆ స‌మ‌యంలో వచ్చిన ఇమేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు .. అక్కడ ఎన్నో రోజులు ఉండలేకపోయాడు ఇప్పుడు మళ్ళీ హర్ష స్థాయి విషయంలో శేఖర్ బాషా వార్తల్లోకి ఎక్కాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: