సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన వెట్టయన్ సినిమా అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజులు బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమాకు మొదటి రోజే మిక్స్ డ్ టాక్ రాకడంతో ఈ మూవీ కి భారీ స్థాయిలో కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర రావడం లేదు. ఇకపోతే ఈ మూవీ కి అత్యంత భారీ ఎత్తున ప్రీ రిలీస్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ ఫార్ములా కి చాలా దూరంలో ఉంది. మరి ఎనిమిది రోజుల్లో ఈ మూవీ కి వచ్చిన కలెక్షన్లు ఎంత ..? ఈ సినిమా మరి ఎన్ని కోట్లు కలెక్షన్లను వసూలు చేస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది ఇలాంటి వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి తమిళనాడు ఏరియాలో ఎనిమిది రోజులకు గాను 85.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 18.65 కోట్ల కలెక్షన్లు దక్కాయి. కర్ణాటక ఏరియాలో ఈ మూవీ కి 25 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ ఏరియాలో 14.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.20 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , ఓవర్సీస్ లో 70 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ఎనిమిది రోజుల్లో ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా 104.20 కోట్ల షేర్ ... 213.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపం చవ్యాప్తంగా ఏకంగా 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ దాదాపుగా 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగినట్లు సమాచారం. ఈ మూవీ ఇప్పటి వరకు 104.20 కోట్ల షేర్ కలెక్షన్లను వాసులు చేయగా హిట్ స్టేటస్కు ఈ మూవీ మరో 57.80 కోట్ల దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి హిట్టు స్టేటస్ కి ఆమడ దూరంలో ఉన్న ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: