జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర పార్ట్ 1 సినిమా కొంత కాలం క్రితం భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను ఈ మూవీ వసూలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమాకు 500 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల అయ్యి 21 రోజులు అవుతుంది. 21 వ రోజు విషయానికి వస్తే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో చాలా వెనుకబడిపోయింది.

ఇక 21 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన సినిమాలలో కల్కి 2898 AD సినిమా 1.52 కోట్ల కలెక్షన్లతో మొదటి స్థానంలో నిలవగా , ఆ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 సినిమా 1.36 కోట్ల కలెక్షన్లతో రెండవ స్థానంలో నిలిచింది  ఆ తర్వాత అలా వైకుంఠపురం లో సినిమా 1.20 కోట్ల కలెక్షన్లతో మూడవ స్థానంలో నిలవగా , రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా 96 లక్షల కలెక్షన్లతో నాలుగవ స్థానంలో నిలిచింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సినిమా 85 లక్షల కలెక్షన్లతో ఐదవ స్థానంలో నిలవగా , అత్తారింటికి దారేది సినిమా 22 లక్షల కలెక్షన్లతో ఆరవ స్థానంలో నిలిచింది. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర సినిమా 71 లక్షల కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 వ రోజు వసూలు చేసి 21 వ రోజు అత్యధిక కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన సినిమాల లిస్టులో ఏడవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: