సాధారణంగా ఏ బ్యూటీ కూడా స్టార్ స్టేటస్ ఉన్న హీరో సినిమాలో అవకాశాలు వస్తే వదులుకోరు . చాలామంది హీరోయిన్స్ అదే విధంగా ముందుకు వెళుతూ ఉంటారు . మరీ ముఖ్యంగా మెగా హీరోలతో సినిమా అవకాశాలు వస్తే బుద్దున్న ఏ హీరోయిన్ కూడా దాన్ని మిస్ చేసుకోరు . అది ఎందుకో కూడా మనకి తెలుసు. అయితే ఒక హీరోయిన్ మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అని తెలిసిన కూడా ఆయన సినిమాని రిజెక్ట్ చేసింది . అది కూడా చాలా చాలా సింపుల్ రీజన్ తోనే..


ఈ విషయం సోషల్ మీడియా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఆ బ్యూటీ మరెవరో కాదు సౌత్ ఇండస్ట్రీలోనే క్రెజియస్ట్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న కోలీవుడ్ బ్యూటీ "నయనతార". నయనతార అంటే అందరికీ ఒక స్పెషల్ రెస్పెక్ట్ . చాలా చాలా మంచి సినిమాలను చూస్ చేసుకుంటుంది అని .. మంచి సినిమాలలో అవకాశాలు వస్తే రిజెక్ట్ చేయదు అని ..మొదటి నుంచి ఆమెకు ఒక్క పేరు ఉంది.



అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన వకీల్ సాబ్ సినిమాలో శృతిహాసన్ పోషించిన పాత్రలో నయనతారను అనుకున్నారట . ఆమెకు కథ కూడా చెప్పారట.  అయితే చాలా చిన్న పాత్ర కావడంతో పవన్ కళ్యాణ్ సినిమా రిజెక్ట్ చేసిందట . పవన్ కళ్యాణ్ హీరో అని తెలిసిన కూడా ఈ ప్రాజెక్టు చేయకపోవడం అప్పట్లో సంచలనంగా మారింది. చాలా మంది నయనతారసినిమా రిజెక్ట్ చేసినందుకు నవ్వుకున్నారు. అయితే శృతిహాసన్ క్యారెక్టర్ చిన్నది ..అయినప్పటికీ సినిమా రిలీజ్ తర్వాత ఆమె మంచి మార్కుల దక్కించుకుంది . నయనతార ఆ పాత్ర పోషించి ఉంటే ఇంకా సినిమా వేరే లెవెల్ లో ఉండేది అంటున్నారు జనాలు . మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నింది నయనతార..!!

మరింత సమాచారం తెలుసుకోండి: